DailyDose

కొడైకెనాల్‌లో ఖమ్మం జంట ఆత్మహత్య-నేరవార్తలు

Khammam Couple Commits Suicide In Kodaikanal

* కొడైకెనాల్‌ లో ఖమ్మం యువజంట ఆత్మహత్యతెలంగాణకు చెందిన ఓ యువ జంట కొడైకెనాల్‌లో బలవన్మరణానికి పాల్పడ్డారు.ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్‌ మండలం మంగళగూడెం గ్రామానికి చెందిన బోజడ్ల గోపీకృష్ణ(26)ఆయన భార్య భద్రాచలం సమీపంలోని చోడవరం గ్రామానికి చెందిన ఏపూరి నందిని(26) కొడైకెనాల్‌లోని ఓ ఐటీ కంపెనీలో పని చేస్తున్నారు.2018లో హైదరాబాద్‌లో ప్రేమ వివాహం చేసుకున్న వీరు కొడైకెనాల్‌లోని అన్నయ్‌ థెరెస్సా యూనివర్సిటీ సమీపంలోని ఓ ఇంట్లో ఏడాది కాలంగా నివాసముంటున్నారు.కాగా శుక్రవారం తెల్లవారుజామున కిరాణా సరుకులు సరఫరా చేసే యువకుడు వారి ఇంటికి వెళ్లగా తలుపులు తీయలేదు. ఫోన్‌ చేసినా స్పందన లేకపోవడంతో లోపలికి చూశాడు.దంపతులిద్దరూ నోట్లో నుంచి నురగలు కక్కి ఉండటాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించాడు.

* ఓ వైపు రాష్ట్రంలో కురుస్తున్న జోరు వర్షాలు, మరోవైపు కోళీకోడ్ విమాన ప్రమాదం ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. కేరళలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఇడుక్కి జిల్లాలోని మున్నార్‌కు సమీపంలో రాజమలై ప్రాంతంలో శుక్రవారం కొండ చరియలు విరిగిపడి 15 మంది దుర్మరణం చెందారు. మృతుల్లో 12 ఏళ్ల బాలుడు, 13 ఏళ్ల బాలిక, ఎనిమిది మంది పురుషులు, ఐదుగురు మహిళలు ఉన్నారు. ఈ ప్రాంతంలో తమిళనాడుకు చెందిన దాదాపు 80 మంది కార్మికులు గుడిసెలు ఏర్పాట్లు చేసుకుని నివాసముంటున్నారు. ఇప్పటికి 15 మంది మృతదేహాలు వెలికితీయగా.. మరో 50 మంది  శిథిలాల కింద చిక్కుకున్నట్లు పోలీసులు తెలిపారు. కొండ చరియలు విరిగిపడ్డ ఘటనా స్థలాల్లో నిరంతరాయంగా సహాయక చర్యలు కొసాగుతున్నాయి. అయితే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. ఇదిలా ఉండగా వందే భారత్ మిషన్‌లో భాగంగా దుబాయ్ నుంచి కేరళలోని కోళీకోడ్‌కు చేరిన విమానం.. గమ్యస్థానానికి చేరుకున్న తర్వాత ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. కిందికి దిగుతూనే రన్‌వే పై నుంచి కిందికి జారి రెండు ముక్కలయ్యింది. ఈ విమాన ప్రమాదంలో ఇప్పటి వరకు 20 మంది చనిపోగా.. వీరిలో పైలట్‌ కెప్టెన్‌ దీపక్‌ సాథే, కో పైలట్‌ అఖిలేష్‌ కుమార్‌ కూడా ఉన్నారు. క్షతగాత్రుల్ని కోజికోడ్ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఒకే రోజు కేరళలో రెండు దుర్ఘటనల్లో దాదాపు 30 మందికి పైగా మృత్యువాత పడ్డారు.

* మృతుల్లో పైలట్‌ దీపక్‌ సాథే, కో పైలట్‌ ఉన్నారని పోలీసులు చెప్పారు.శకలాల నుంచి ప్రయాణికులను కాపాడేందుకు సహాయ చర్యలు మొదలయ్యాయి.కొందరు క్షతగాత్రులను రక్షించి, ఆసుపత్రులకు తరలించారు.వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది.

* విమాన ప్రమాదంలో 17కి పెరిగిన మృతుల సంఖ్యభారీ వర్షాలే ప్రమాదానికి కారణమని అంచనా..కేరళ కొజికోడ్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో మృతుల సంఖ్య 17కి పెరిగింది. గమ్యస్థానానికి చేరుకున్న ‘ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌’ విమానం అనూహ్యంగా అదుపుతప్పి, 35 అడుగుల లోయలో పడింది. ఇందులో 17 మంది చనిపోగా 100 మందికి పైగా గాయపడ్డారు. ఇద్దరు పైలట్లు, ఐదుగురు క్యాబిన్‌ సిబ్బంది, పది మంది చిన్నారులు సహా 174 మంది ప్రయాణికులతో దుబాయ్‌ నుంచి వచ్చిన బోయింగ్‌ 737 (ఫ్లైట్‌ ఐఎక్స్‌ 1344) విమానం శుక్రవారం రాత్రి 7.41 గంటలకు కొజికోడ్‌ విమానాశ్రయంలో దిగింది.

* ప్రభుత్వం జూనియర్ డాక్టర్స్ సమస్యలను పరిష్కరించకపోతే నేటి నుంచి విధులు బహిష్కరణకు జూనియర్ డాక్టర్లు పిలుపునిచ్చారు.జూనియర్ డాక్టర్స్ సమ్మె పిలుపుతో వైద్య శాఖ ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు.నేడు జూడాలతో వైద్య శాఖ ఉన్నతాధికారులు చర్చలు జరపనున్నారు.అధికారులతో చర్చల అనంతరం తమ భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని జూనియర్ డాక్టర్లు తెలిపారు.

* శానిటైజర్ సేవించి నలుగురు యువకులు మృతి చెందడం చాలా బాధాకరం.తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి.శానిటైజర్ మత్తు మందు కాదు ఇది విషపూరితమైన చేతులుశుభ్ర పరుచుకోవడానికి వినియోగించే మందు,దీనిపై అధికారులు, ప్రభుత్వము పదేపదే చెబుతున్న ఇలాంటి సంఘటన జరగడం దురదృష్టకరం.మద్యానికి బానిసైన యువకులు ప్రాణాలమీదికి కొని తెచ్చుకుంటున్నారు.నలుగురు యువకులు ఇలాంటి వ్యసనాలకు బానిస మృతి చెందడం ఆశ్చర్య కరమైన విషయమే .చేతులు శుభ్రపరుచుకుని శానిటైజర్ మత్తుకు వాడకూడదని నమస్కరిస్తున్నా…తిరుపతి రుయా ఆస్పత్రిలో ని మార్చురీ ని సందర్శించిన ఎమ్మెల్యే.మృతదేహం వద్ద చింతించిన ఎమ్మెల్యే,రుయా సూపరిండెంట్.

* నవవధువు కాళ్ళ పారాణి ఆరకముందే హఠాన్మరణం. సత్తెనపల్లి నియోజకవర్గం. ముప్పాళ్ల మండలం లోపెళ్లి అయిన 24 గంటలు లోపే వధువు మృతి.గుంటూరు జిల్లాలో తీవ్ర విషాదం ఘటన. చోటుచేసుకుంది.ఎన్నో ఆశలతో పుట్టింటి నుంచి మెట్టినింట అడుగుపెట్టి న యువతి ఊహించని విధంగా వివాహం అయిన 24 గంటల్లోపే మరణించింది.ఈ ఘటన రెండు కుటుంబాల్లో తీరని వేదనను మిగిల్చింది.ముప్పాళ్ళ మండలంలోని ఇరుకుపాలెం గ్రామానికి చెందిన తురకా సుందరరావు కుమారుడు ఫోటోగ్రాఫర్ ఆనంద్ కు రొంపిచర్ల మండలం లోని మునమాక కు చెందిన చావా వీరబాబు కుమార్తె భవాని( 20) కి పెద్దలు వివాహం కుదిర్చారు.టిటిసి పూర్తి చేసి ఇంటి వద్దే ఉంటోంది.ఆమె కొంతకాలంగా నెమ్ము ఆయాసం తో బాధపడుతోంది.

* చదివిస్తాం, పెళ్లిచేస్తామని..*బాలికలను వ్యభిచార కూపంలోకి101 మంది మైనర్లకు విముక్తి కల్పించిన రాచకొండ పోలీసులుహైదరాబాద్:అభం శుభం తెలియని బాలికలనూ కేటుగాళ్లు వదలడం లేదు. పెంచుకుంటామంటూ.. చదివిస్తామంటూ.. పెళ్లి చేస్తామంటూ తల్లిదండ్రులకు నచ్చజెప్పి ఇక్కడికి తీసుకొస్తున్నారు. కాసుల కక్కుర్తితో వ్యభిచారం రొంపిలోకి దింపుతున్నారు. రాచకొండ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో నాలుగేళ్లలో 101 మంది మైనర్లను ఈ కూపం నుంచి రక్షించారు.దళారుల సాయంతో వల.2016 నుంచి ఇప్పటివరకు రాచకొండ పోలీసులు 144 వ్యభిచార గృహాలను మూసివేయించారు. అక్కడ మగ్గిపోతున్న 547 మంది బాధితురాళ్లకు విముక్తి కల్పించారు. వీరిలో సుమారు 20 శాతం మంది మైనర్లే ఉండటం ఆందోళన కలిగిస్తోంది. కొందరు విటుల ఆసక్తి దృష్ట్యా ఎంత డబ్బయినా ఇచ్చేందుకు వెనకడుగేయరని విచారణలో తేలడంతో పోలీసులే ఔరా అంటూ ముక్కున వేలేసుకున్నారు. దండిగా డబ్బులు వస్తుండటంతో వ్యభిచార గృహాల నిర్వాహకులు దళారుల సాయంతో బస్తీలు, గ్రామాల్లో ఎక్కువ మంది అమ్మాయిలున్న పేద కుటుంబాలపై వల విసురుతున్నారు. ఫలానా ఆశ్రమం నుంచి వచ్చామంటూ నమ్మించి ఎంతో కొంత డబ్బులు ముట్టజెప్పి ఇక్కడికి తీసుకొస్తున్నట్లు పోలీసులు పేర్కొంటున్నారు. ఇక్కడికొచ్చాకా నయానో.. భయానో బెదిరించి ఈ రొంపిలోకి దింపుతున్నారని, ఆ ప్రభావం వారి మానసిక ఆరోగ్యంపై పడుతుందని వివరిస్తున్నారు.భర్త విదేశాల్లో ఉన్నాడంటూ..పోలీసులకు అనుమానం రాకుండా నిర్వాహకులు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటున్నారు. భర్త విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నారని, నేను, నా ఇద్దరు పిల్లలు ఇక్కడుంటామంటూ ఏకంగా అపార్ట్‌మెంట్లలోనే అద్దెకు దిగుతున్నారు. పురుషులు ఆ దరిదాపుల్లోకి కూడా రారు. అసలు నిర్వాహకులు తెరవెనుకే ఉంటారు. దందా అంతా ఆన్‌లైన్‌లోనే నడుస్తోంది. డబ్బులు కూడా గూగుల్‌పే, ఫోన్‌పే, పేటీఎం ద్వారా మాత్రమే తీసుకుంటారు. విటులు కోరిన చోటుకే బాలికలను తీసుకెళ్తారు. కొంత కాలం తర్వాత ఆ ఇద్దరు బాలికలను వేరే ముఠాకు విక్రయించి.. కొత్తవారిని ఇంటికి తీసుకొస్తారు. నా పిల్లలను భర్త దగ్గరికి పంపించానని, వీరు మా బంధువులంటూ పరిచయం చేస్తారు. దీంతో పోలీసులు, స్థానికులకు ఎలాంటి అనుమానం తలెత్తడం లేదు. కొన్నాళ్లకు నేను కూడా నా భర్త దగ్గరికి వెళ్లిపోతున్నానంటూ అడ్డా మార్చేస్తున్నారు.

* ప్రకాశం జిల్లా చీరాల వేటపాలెం బైపాస్ రోడ్డు లో కార్ బోల్తా.డ్రైవర్ మృతి.ముగ్గురికి గాయాలు.క్షతగాత్రులను చీరాల ప్రభుత్వ వైద్యశాలకు తరలింపు.

* భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు అంబేద్కర్ సెంటర్లో లో చికెన్ షాప్ నిర్వాహిస్తున్ మహమ్మద్ మెహబూబ్ పాషా బార్య హబీబ్ బేగం (40) హత్యకు గురైంది.