NRI-NRT

ఖతర్ జాగృతి ఆధ్వర్యంలో చేనేత ఛాలెంజ్

ఖతర్ జాగృతి ఆధ్వర్యంలో చేనేత ఛాలెంజ్

జాతీయ చేనేత దినోత్స‌వం సందర్భంగా స్వదేశీ చేనేత పరిశ్రమలకు అండగా నిలవాలన్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పిలుపు మేర‌కు ఆగ‌స్ట్ 7న తెలంగాణ జాగృతి ఖతర్ శాఖ ఆధ్వర్యంలో హ్యండ్లూమ్ ఛాలెంజ్ ప్రారంభించారు. తెలంగాణ జాగృతి ఖతర్ అధ్యక్షురాలు నందిని అబ్బగౌని వివ‌రాల‌ను వెల్ల‌డించారు. తెలంగాణ చేనేత సృజ‌నాత్మ‌క‌త‌ను, ఘన చ‌రిత్రను దేశ విదేశాల్లో అవ‌గాహన‌‌, ప్రాచుర్యం క‌ల్పించాలనే ఉద్దేశ్యంతో తాము ఈ ఛాలెంజ్‌ను ప్రారంభించిన‌ట్లు తెలిపారు. ఈ నెల 7 నుండి 10వ తేదీ వరకు జరిగే హ్యండ్లూమ్ ఛాలెంజ్ కార్య‌క్ర‌మానికి విశేష స్పందన వస్తోంద‌న్నారు. ఖతర్ తోపాటు యూకే‌, న్యూజిలాండ్, కువైట్ వంటి దేశాల నుండే కాకుండా భారత్ లో సైతం కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుండి పలువురు మ‌హిళ‌లు ఛాలెంజ్‌ను స్వీకరించి విజయవంతం చేశారని తెలిపారు. ఈ ఛాలెంజ్‌లో పాల్గొన్నవారిలో 10 మందిని విజేతలుగా ప్ర‌క‌టించి సిరిసిల్ల చేనేత చీరలను బహుమతిగా ఇవ్వనున్నట్లు చెప్పారు. చేనేతకు చేయూత ఇవ్యడానికి నేతన్న‌ల‌ కుటుంబాలకు లక్ష రూపాయల ఆర్డర్లు ఇవ్యనున్నట్లు వెల్ల‌డించారు. పరాయి దేశాల వ‌స్తువుల వినియోగాన్ని సాధ్యమైన రీతిలో త‌గ్గించి మ‌న సంస్కృతి, వైభవాన్ని, కళాత్మకత‌ను ప్రోత్సాహిస్తూ మన దేశ‌పు వ‌స్తువులు వాడితే గ్రామీణ ప్రాంతాల్లో చాలామందికి ఉపాధి దొరుకుతుందని, వారి కుటుంబాలకు ఎంతో మేలు జ‌రుగుతుంద‌ని నందిని పేర్కొన్నారు.
ఖతర్ జాగృతి ఆధ్వర్యంలో చేనేత ఛాలెంజ్-nandini abbagouni qatar telangana jagruti