DailyDose

విశాఖలో మరో అగ్నిప్రమాదం-నేరవార్తలు

విశాఖలో మరో అగ్నిప్రమాదం-నేరవార్తలు

* విశాఖ పోర్ట్ ట్రస్ట్ లో నౌకలో అగ్నిప్రమాదం.వెస్ట్ క్యూ ఫైవ్ బర్త్ లో నౌకలో ఇంజన్ రూమ్ నుంచి పొగలు.మంటలను అదుపు చేస్తున్న కోర్టు ఫైర్ సిబ్బంది.అగ్ని ప్రమాదం ఇంజన్ రూమ్ లో కావడంతో గ్యాస్ మాస్కు ధరించి మంటలను అది చేస్తున్న సిబ్బంది.ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణంగా అనుమానిస్తున్న పోర్ట్ అధికారులు.

* ఒకే కుటుంబంలోని 11మంది సామూహిక ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన రాజస్థాన్‌లో చోటుచేసుకుంది. జోధ్‌పూర్‌లో నివాసం ఉంటున్న ఓ కుటుంబంలోని 12మంది విషం తాగి ఆత్మహత్య చేసుకున్నారు. వీరిలో 11మంది మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు జోధ్‌పుర్‌ పోలీసులు వెల్లడించారు.

* కేరళలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 24కు చేరింది.

* కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ ‌సింగ్‌ ఆదివారం కీలక ప్రకటన చేశారు. 101 రక్షణ వస్తువుల దిగుమతులపై నిషేధం విధిస్తున్నట్లు ఆదివారం ట్విటర్‌ ద్వారా తెలిపారు. ‘ఆత్మనిర్భర్‌ భారత్‌’ కార్యక్రమానికి ఊతమిచ్చేందుకే రక్షణ శాఖ కీలక నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఆయుధాలతో పాటు ఇతర రక్షణ వస్తువులు ఇక మీదట దేశీయంగానే తయారవనున్నాయి. ఇది భారత రక్షణశాఖ తయారీ రంగాన్ని బలోపేతం చేస్తుందని రాజనాథ్‌ తెలిపారు.

* స్వర్ణ ప్యాలెస్ హోటల్ ను కోవిడ్-19 సెంటర్ గా మార్చి నప్పుడు ఫైర్ అనుమతి తీసుకోలేదు..స్వర్ణ ప్యాలెస్ హోటల్ 30 మంది కోవిడ్ పాజిటివ్ వచ్చిన వారు చికిత్స పొందుతున్నారు.ఇప్పుటి వరకు 11 మంది ఫైర్ యాక్సిడెంట్ లో చనిపోయారు.ఫైర్ ఎలా జరిగింది అనేదాని పై విచారణ చేస్తున్నాం.విచారించిన తరువాత హోటల్ యాజమాన్యం పై చర్యలు తీసుకుంటాం.

* కరోనా క్వారంటైన్ సెంటర్ హోటల్ స్వర్ణా ప్యాలెస్ అగ్ని ప్రమాద ఘటనలో మృతి చెందిన వివరాలు…రమేష్, విజయవాడ…పూర్ణ చంద్ర రావు.. మొవ్వడోక్కు శివ బ్రహ్మయ్య, మచిలీపట్నం…మజ్జి గోపి మచిలీపట్నం…అబ్రహం…జగ్గయ్య పేటరాజకుమారి జగ్గయ్యపేటసుంకర బాబు రావు, సింగ్ నగర్ రిటైర్డ్ ఎస్సైవెంకట లక్ష్మి సువర్చలా దేవి కందుకూరుసువర్ణ లత పొన్నూరు, నిడుబ్రోలు

* నటుడు సుశాంత్‌సింగ్‌ మృతి కేసులో అతడి ప్రియురాలు రియా చక్రవర్తిని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) దాదాపు 9 గంటలపాటు విచారించింది. రియాతోపాటు ఆమె సోదరుడు షోవిక్‌ చక్రవర్తి, మాజీ మేనేజర్‌ శ్రుతి మోదీ విచారణకు హాజరవగా వారిని వేర్వేరు గదుల్లో ప్రశ్నించినట్లు అధికారులు తెలిపారు. మనీ ల్యాండరింగ్‌ కేసు కింద వారి వాంగ్మూలాన్ని రికార్డు చేశారు. రియాను వచ్చేవారం సైతం ప్రశ్నించనున్నారు. నటి విచారణకు సహకరించిందని, చాలా ప్రశ్నలకు సమాధానం ఇచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. తన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో తనను ప్రశ్నించడాన్ని వాయిదా వేయాలని గతంలో రియా కోరగా ఈడీ అందుకు నిరాకరించింది. విచారణకు హాజరు కావాల్సిందిగా కోరగా ఆమె విచారణకు హాజరయ్యింది.