WorldWonders

తేళ్ల సంబరాలు

తేళ్ల సంబరాలు

తేలును చూస్తే భయపడతాం. దూరంగా జరిగి చంపేస్తాం. కానీ నారాయణపేట పరిసర గ్రామాల్లో తేళ్లతో సంబురం చేసుకుంటారు. చేతిలో పట్టుకొని ఆడిస్తారు, పాడిస్తారు. ఇంతకూ ఆ సంప్రదాయం ఎక్కడి నుంచి వచ్చింది?
*తేళ్లకు పూజ చేయడం కర్ణాటక సంస్కృతిలో భాగం. రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లోనూ ఈ ఆచారం ఉంది. కానీ తెలంగాణలోని కొన్ని గ్రామాల్లో తేళ్లను పూజించే సంప్రదాయం ఇంకా కొనసాగుతున్నది. నారాయణపేట సమీప గ్రామాల్లో తేళ్లు అంటే ప్రజలకు భయం ఉండదు. అవంటే వాళ్లకు మహా భక్తి. తేళ్లను ఇలవేల్పుగా భావిస్తూ.. పంచమి రోజు ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తున్నారు. పాములకు బదులు తేళ్లకు నైవేద్యాలు పెట్టి ఉత్సవం జరుపుకొంటున్నారు. వాస్తవానికి ఈ ఆచారం కర్ణాటకలోని యాద్గిర్‌ తాలూకా కందుకూరు గ్రామంలో ఉంది. ఇది క్రమంగా తెలంగాణలోని సరిహద్దు గ్రామాలకూ పాకింది. దేశమంతట నాగుల పంచమి రోజున నాగదేవతకు పూజలు చేస్తే ఇక్కడ మాత్రం ప్రత్యేకంగా తేళ్లకు పూజ చేసే సంప్రదాయం అనాదిగా వస్తున్నది. ఏం మహిమో ఏమోగానీ ఈ ఒక్కరోజూ తేళ్లు ఎవరినీ కుట్టవు. అందుకే, చిన్న పిల్లలు సైతం వాటితో ఆడుకుంటారు. కొండ మహేశ్వరి దేవతగా పేర్కొనే తేలు విగ్రహాన్ని ప్రతిష్టించి ఏటా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. వృశ్చిక భగవానుడు వారికిసకల శుభాలూ కలిగించాలి.