Movies

ఓల్డ్ ఆంటీగా నయనతార

ఓల్డ్ ఆంటీగా నయనతార

ఏ సినిమాలో ఎవరు నటిస్తారు? ఏ పాత్ర ఎవరి సొంతం అవుతుందనేది ఆయా నటులు కెమెరా ముందుకొచ్చేవరకూ ఖరారు కాదు. కానీ ఈలోపు పలువురి పేర్లు ప్రచారంలో ఉంటాయి. అలా ప్రస్తుతం తెలుగు చిత్రసీమలో కొద్దిమంది నటుల పేర్లు ప్రచారంలో ఉన్నాయి. అందులో ఒకటి…నయనతార కాగా, మరొకటి రకుల్‌ప్రీత్‌ సింగ్‌ పేరు. హిందీలో విజయవంతమైన ‘అంధాదున్‌’ని నితిన్‌ హీరోగా రీమేక్‌ చేస్తున్న విషయం తెలిసిందే. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మధ్య వయస్కురాలి పాత్ర ఉంటుంది. ఆ పాత్ర కోసం నయనతారని సంప్రదించారని తెలిసింది. మరి ఆమె ఒప్పుకుంటారా లేదా అన్నది తెలియాలంటే మరికొన్నాళ్లు ఆగాల్సిందే. అలాగే తెలుగులో తెరకెక్కబోతున్న ఓ బయోపిక్‌ విషయంలో రకుల్‌ప్రీత్‌ సింగ్‌ పేరు వినిపిస్తోంది. ఫిట్‌నెస్‌కి పెట్టింది పేరైన రకుల్‌ ఆ బయోపిక్‌లో నటించే అవకాశాలున్నాయని, ఆమెతో సంప్రదింపులు జరుగుతున్నాయని ప్రచారం సాగుతోంది. కరోనా పరిస్థితుల నేపథ్యంలో చిత్ర పరిశ్రమ వ్యవహారాలన్నీ నిదానంగా సాగుతున్నాయి. చిత్రీకరణలు ఊపందుకుంటే మాత్రం నటీనటుల విషయంలో ఒక స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి.