ScienceAndTech

అండమాన్ దీవుల్లో ఫైబర్ కేబుల్ సేవలు

అండమాన్ దీవుల్లో ఫైబర్ కేబుల్ సేవలు

అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం పర్యటించారు. ఈ సందర్భంగా సబ్‌మెరైన్ ఆప్టికల్ ఫైబర్‌ కేబుల్‌ను ప్రారంభించారు. చెన్నై నుంచి పోర్టు బ్లెయిర్‌ వరకు సబ్‌మెరైన్ ఆప్టికల్ ఫైబర్‌ కేబుల్‌ ఏర్పాటు చేశారు. అండమాన్‌కు మెరుగైన సమాచారం అందించేలా ఫైబర్‌ కేబుల్‌ వ్యవస్థ పనిచేస్తుంది. చెన్నై నుంచి పోర్ట్ బ్లెయిర్‌తో పాటు మరో ఏడు ద్వీపాలకు సబ్‌మెరైన్ కేబుళ్లు తీరంలో ఉన్న ద్వీపాలకు టెలీకమ్యూనికేషన్ సిగ్నల్స్ పంపించేలా చర్యలు చేపట్టారు.