DailyDose

బెజవాడలో మరో గ్యాంగ్‌వార్-నేరవార్తలు

బెజవాడలో మరో గ్యాంగ్‌వార్-నేరవార్తలు

* నగరంలో మరోసారి గ్యాంగ్ వార్కేదారేశ్వరి పేట లో కర్రలు కత్తులతో చేసుకున్న దాడి చేసుకున్న వైనంమున్నా రాహూల్ వర్గాల మద్య పాత గోడవలు..గత 31 న జరిగిన ఘటనలో 11 మంది అరెస్ట్..ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన గ్యాంగ్ వార్ ఘటన..

* స్వర్ణ ప్యాలస్ ఫైర్ యాక్సిడెంట్ కేసులో రమేష్ హాస్పిటల్ అధినేత రమేష్ పరారీ.రమేష్ కోసం ప్రత్యేక బృందాలు గాలింపు.స్వర్ణ ప్యాలస్ కేసు దర్యాప్తు ముమ్మరం చేసిన విజయవాడ పోలీసులు.

* చంద్రగిరి టిడిపి కార్యకర్త రాకేష్ అక్రమ అరెస్ట్ పై చంద్రబాబు ఆగ్రహంతప్పుడు కేసులు వెంటనే విత్ డ్రా చేయాలని డిమాండ్చిత్తూరు జిల్లా చంద్రగిరిలో టిడిపి కార్యకర్త రాకేష్ పై తప్పుడు కేసులు పెట్టడాన్ని తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఒక ప్రకటనలో ఖండించారు. ‘‘గతంలో సోషల్ మీడియాలో వైసిపిపై పోస్ట్ పెట్టాడన్న అక్కసుతో, లేని గొడవ సృష్టించి ఇంటిపక్క వాళ్లతో తప్పుడు ఫిర్యాదు చేయించి రాకేష్ ను అరెస్ట్ చేయడం గర్హనీయం.ఆ సమయంలో ఇంట్లో లేని రాకేష్ పై 354, 347, 447, 507, రెడ్ విత్ 34కింద సెక్షన్లు పెట్టడం పూర్తిగా కక్ష సాధింపే..అతనిపై పెట్టిన అక్రమ కేసులు వెంటనే రద్దు చేయాలని’’ చంద్రబాబు డిమాండ్ చేశారు.

* విశాఖలోని దొండపర్తి జంక్షన్‌లో ఉన్న కేఎస్‌ఆర్ కాంప్లెక్స్ భవనం సెల్లార్లో అగ్నిప్రమాదం సంభవించింది. గత అర్ధరాత్రి 2 గంటల సమయంలో సెల్లార్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో సెల్లార్‌లో నిల్వ ఉంచిన ఫర్నిచర్, వేస్ట్ ఫర్నిచర్ మంటలకు ఆహుతైంది. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని అర్ధరాత్రి నుంచి శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. మంటలు అదుపులోకి వచ్చినప్పటికీ దట్టమైన పొగలు మాత్రం ఇంకా వస్తున్నాయి.  షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు అగ్నిమాపక శాఖ అధికారులు భావిస్తున్నారు.