Politics

కేటీఆర్ హెచ్చరికలు

కేటీఆర్ హెచ్చరికలు

సామాజిక మాధ్యమ వినియోగదారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని మంత్రి కేటీఆర్‌ సూచించారు. ఒక తప్పుడు పోస్టు, ప్రచారం ఎంతటి అనర్థానికి దారితీస్తుందో ఆయన ట్విటర్‌ వేదికగా ఉదహరించారు. బెంగళూరులో ఓ వర్గాన్ని కించపరిచేలా సామాజిక మాధ్యమంలో పెట్టిన పోస్టుల విషయంలో మంగళవారం రాత్రి చెలరేగిన అల్లర్లలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. 60 మంది పోలీసులు గాయపడిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి 147 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనను ఉదహరిస్తూ ‘‘ఒక బాధ్యతారహిత పోస్టు ఎంతటి అనర్థానికి దారితీస్తుందో. అవాస్తవాలు, అమర్యాదలకు పాల్పడే పోస్టుల పట్ల నెటిజన్లు జాగ్రత్త వహించాలి. సామాజిక మాధ్యమాలను సంఘవ్యతిరేక శక్తులకు వేదికగా మార్చరాదు’’ అని ట్వీట్‌ చేశారు. ఘటనకు సంబంధించిన ఫోటోలను ఈ మేరకు పోస్టు చేశారు.