NRI-NRT

న్యూజెర్సీలో మళ్లీ రికార్డు సంఖ్యలో కరోనా కేసులు

న్యూజెర్సీలో మళ్లీ రికార్డు సంఖ్యలో కరోనా కేసులు

గత రెండు నెలల వ్యవధిలో అత్యధిక కేసులు నమోదు అయిన రోజుగా ఆగష్టు 13వ తారీఖు న్యూజెర్సీ రాష్ట్రంలో రికార్డు నెలకొల్పింది. నేడు ఒక్కరోజే 699 కేసులు నమోదు అయినట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. జూన్ 6 తర్వాత ఒకేరోజు 600పైచిలుకు కేసులు నమోదు కావడం ఇది రెండోసారి. ఇప్పటివరకు ఈ రాష్ట్రంలో 15892 మంది కరోనా కారణంగా మృత్యువాతపడ్డారు.