DailyDose

కరోనా ఉచ్చులో అచ్చెన్న-TNI బులెటిన్

కరోనా ఉచ్చులో అచ్చెన్న-TNI బులెటిన్

* మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడుకు కరోనా పాజిటివ్‌ అని నిర్ధారణ అయ్యింది. జ్యుడిషియల్‌ రిమాండ్‌లో ఉన్న అచ్చెన్నకు స్థానికంగా ఉన్న రమేష్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. పూర్తి వివరాల్లోకెళితే.. నిన్న ఉదయం నుంచి జలుబు చేయటంతో అచ్చెన్నకు కరోనా పరీక్షలు నిర్వహించారు. ఆయనకు పాజిటివ్ రావడంతో హైకోర్ట్‌కు లేఖ రాయాలని నిర్ణయించారు. అచ్చెన్న ఆరోగ్య పరిస్థితిపై ప్రతివారం ఆస్పత్రి హైకోర్ట్‌కు బులెటిన్ ఇస్తున్నది. కాగా ప్రస్తుతం అచ్చెన్నాయుడుకు రమేష్‌ ఆస్పత్రి వైద్యులు కరోనా చికిత్స అందిస్తున్నారు. అచ్చెన్నకు పాజిటివ్ రావడంతో కుటుంబీకులు, అభిమానులు, కార్యకర్తలు, అనుచరులు ఆందోళన చెందుతున్నారు.

* స్వర్ణప్యాలెస్, రమేశ్ ఆసుపత్రి యజమానుల కోసం హైదరాబాద్, విజయవాడలో గాలింపువిజయవాడలో కరోనా చికిత్సా కేంద్రంగా రమేశ్ ఆసుపత్రి వినియోగిస్తోన్న స్వర్ణ ప్యాలెస్‌ హోటల్‌లో ఇటీవల చోటు చేసుకున్న భారీ అగ్ని ప్రమాదంలో 10 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అయితే, హోటల్‌ నిర్వహణతో తమకు సంబంధం లేదని, అందులోని రోగులకు వైద్య సేవలు అందించే బాధ్యతను మాత్రమే తమ‌ ఆసుపత్రి నిర్వహించిందని ఇప్పటికే రమేశ్ ఆసుపత్రి యాజమాన్యం వివరించింది.ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. హోటల్ యజమాని ముత్తవరపు శ్రీనివాసరావుతో పాటు ఆసుపత్రి యజమాని రమేశ్ ఆచూకీని గుర్తించడం కోసం ప్రత్యేక బృందాలు ఏర్పడ్డాయి. వారి కోసం హైదరాబాద్, విజయవాడ పరిసర ప్రాంతాల్లో గాలిస్తున్నాయి. అగ్ని ప్రమాద ఘటన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది.

* తిరువూరులో ఆరుగురికి కరోనా పాజిటివ్. బైపాస్ రోడ్డులో ఒకే కుటుంబంలో నలుగురు,పి.టి.కొత్తూరులో ఒకరు, మూడో వార్డులో ఒక మహిళకు పాజిటివ్ నమోదు అయినట్లు సమాచారం. అధికారులు ధృవీకరించాల్సి ఉంది.

* ఇష్టారాజ్యంగా ఫీజుల వసూలు.. డబ్బులు కట్టనిదే చచ్చినా శవం ఇచ్చే పరిస్థితి లేదు.. తప్పుడు రిపోర్ట్‌లు, అనవసర వైద్యం.. ప్రైవేట్‌ బీమా ఉన్నా పట్టించుకునే దిక్కులేదు.. ప్రస్తుతం కొన్ని ప్రైవేట్, కార్పొరేట్‌ ఆసుపత్రులపై ప్రజల నుంచి వెల్లువెత్తుతోన్న ఫిర్యాదులివి. వీటితోపాటు రోగి ఎలా ఉన్నాడో చెప్పే దిక్కూలేదు. ఎంతంటే అంత డబ్బులు కట్టుకుంటూ పోవడమే బాధిత కుటుంబాల పని. వారి ఆర్థిక పరిస్థితి గురించి ఆలోచనే లేదు. కొన్ని ఆసుపత్రులైతే శవాలపై పైసలు ఏరుకుంటున్నాయి. ప్రభుత్వం ఇప్పటికే రెండు ఆసుపత్రులపై చర్యలకు దిగింది. మరికొన్ని ఆసుపత్రుల అక్రమాలపై నివేదికలు సిద్ధమయ్యాయి. వాటిపైనా చర్యలు తీసుకోవాలని సర్కారు నిర్ణయించింది. ఇంత జరుగుతున్నా అనేక ప్రైవేట్, కార్పొరేట్‌ ఆసుపత్రుల తీరు మారట్లేదు. దీంతో ఫైనల్‌ వార్నింగ్‌ ఇవ్వాలని సర్కారు నిర్ణయించింది. గురు, శుక్రవారాల్లో ఒకరోజు ప్రైవేట్, కార్పొరేట్‌ ఆసుపత్రుల యాజమాన్యాలతో సమావేశమై….పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించాలని వైద్య ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్‌ నిర్ణయించారు.

* ఏపీ రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 1931 కారోనా కేస్ లు నమోదు.86475 కి చేరిన మొత్తం కారోనా కేస్ లు.11 మంది మృతి 665 కి చేరిన మొత్తం మృతుల సంఖ్య.1780 మంది డిశ్చార్జ్ 63074 మంది కోలుకున్నారు.22736 యాక్టీవ్ కేస్ లు ఉన్నాయి.రాష్ట్రంలో ఇప్పటి వరకు 689150 టెస్ట్ లు నిర్వహణజీహెచ్ఎంసీ లో 298 కేస్ లు, జగిత్యాల 52 , జనగామ 59, గద్వాల్ 56, కరీంనగర్ 89, ఖమ్మం 73, మల్కాజ్గిరి 71, నగర్ కర్నూల్ 53, నిజామాబాద్ 53, నల్గొండ 84, పెద్దపల్లి 64, సిరిసిల్ల 54, రంగారెడ్డి 124, సంగరెడ్డి 86, సిద్దిపేట 71, సూర్యాపేట 64, వరంగల్ అర్బన్ 144 కేస్ లు నమోదు.

* ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసులు ఏమాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. ఏపీలో గడచిన 24 గంటల్లో 9,996 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన కేసులను పరిశీలిస్తే.. తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 1504 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. చిత్తూరు జిల్లాలో 963 కరోనా పాజిటివ్ కేసులు, విశాఖపట్నం జిల్లాలో 931, అనంతపురం 856, పశ్చిమ గోదావరి 853, కర్నూలు 823, కడప 784, నెల్లూరు 682, ప్రకాశం 681, గుంటూరు 595, విజయనగరం 569, శ్రీకాకులం 425, కృష్ణా జిల్లాలో 330 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.