DailyDose

రాముడిపై పిచ్చికూతలు. రిమాండ్‌కు కత్తిమహేష్-నేరవార్తలు

రాముడిపై పిచ్చికూతలు. రిమాండ్‌కు కత్తిమహేష్-నేరవార్తలు

* సినీ విశ్లేషకుడు కత్తి మహేశ్‌ను సైబర్‌ క్రైమ్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సామాజిక మాధ్యమాల్లో రాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులు అందడంతో సైబర్‌ క్రైమ్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇందులో భాగంగా కత్తి మహేశ్‌ను శుక్రవారం ఉదయం అదుపులోకి తీసుకుని విచారించారు. అనంతరం వైద్య పరీక్షల నిమిత్తం ఉస్మానియా, కరోనా పరీక్షల కోసం కింగ్‌ కోఠి ఆసుపత్రికి తరలించారు. కత్తిమహేష్‌పై ఐపీఎస్‌ సెక్షన్‌ 153ఏ కమ్యూనల్‌ యాక్ట్‌ కింద పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

* స్వర్ణ ప్యాలెస్ అగ్ని ప్రమాదం ఘటనలో రాయపాటి సాంబశివరావు కోడలు డాక్టర్ మమతకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఇటీవలే కరోనా నుంచి కోలుకుని హోం ఐసోలేషన్‌లో డాక్టర్ మమత ఉన్నారు. తప్పనిసరిగా హాజరుకావాలంటూ పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారు. దీంతో నేడు విజయవాడ పోలీసు కమిషనర్ కార్యాలయంలో మమత విచారణకు హాజరుకానున్నారు.

* Supreme Court holds advocate Prashant Bhushan guilty of contempt of court for his tweets against Chief Justice of India SA Bobde and Supreme Court.

* వనపర్తి జిల్లా రేవల్లి మండలం నాగపూర్‌ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అనుమానాస్పదంగా మృతి చెందటం కలకలం రేపింది. పోలీసుల కథనం ప్రకారం.. ఆజీరాం బీ(63,) ఆమె కుమార్తె ఆస్మా బేగం(35), అల్లుడు ఖాజా పాషా (42), మనుమరాలు హసీనా(10) మృతదేహాలు ఇంట్లో వేర్వేరు చోట్ల పడిఉన్నాయి. వంట గదిలో అజీరాం బీ, డైనింగ్‌ హాలులో ఆస్మా బేగం, ఇంటి వెనుక గుంత వద్ద అల్లుడు, హాలులో హసీనా మృతదేహాలు ఉన్నాయి. శుక్రవారం ఉదయం 7గంటల దాటినా ఇంట్లో నుంచి ఎవరూ బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన స్థానికులు ఇంట్లోకి వెళ్లి చూడగా… నలుగురూ విగత జీవులై పడి ఉన్నారు. వెంటనే పోలీసులు, మృతుల బంధువులకు సమాచారమందించారు.

* కొందరు యువకులు మృగాలుగా మారి ఓ యువతి పట్ల అమానవీయంగా ప్రవర్తించారు. వివస్త్రని చేసి ..దుస్తులు ఇవ్వకుండా వికృత చేష్టలకు పాల్పడ్డారు. ఈ అమానుష ఘటన శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు నగరంలోని వెంకటేశ్వరపురం జనార్దన్‌రెడ్డి కాలనీలో బుధవారం రాత్రి జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. మహమూర్‌ మసీదు వెనక గొర్రెల మండీ ఉంది. దీని పక్కన నిర్మానుష్యంగా ఉండటంతో చీకటి కార్యకలాపాలకు వేదికగా మారింది. ఈ క్రమంలో బుధవారం రాత్రి ఓ గొర్రెల కాపరి అటువైపు వెళుతుండగా ఓ ఆటో నిలిపి ఉంది. ఆ ప్రాంతంలో ఎందుకుందో అనుకుంటూ..అనుమానం వచ్చి చూడగా ఆరుగురు యువకులు కలసి ఒక యువతిని వివస్త్రను చేసి దుస్తులు ఇవ్వకుండా అమానుషంగా ప్రవర్తిస్తున్నారు. దీంతో ఆయన తన దగ్గరున్న టార్చ్‌లైటు వేయడంతో వారు ఆటోలో అక్కడి నుంచి పరారయ్యారు. ఆటో వెనుక ఓ సినిమా నటుడి స్టిక్కర్‌ ఉన్నట్లు గుర్తించారు. గొర్రెల కాపరి యువతికి దుస్తులు ఇవ్వడంతో ఆమె అక్కడ నుంచి వెళ్లిపోయింది. ఈ ఘటనపై నవాబుపేట సీఐ వేమారెడ్డిని వివరణ కోరగా తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని అన్నారు. ఆ ఘటనపై విచారణ నిర్వహిస్తామని పేర్కొన్నారు.

* గుంటూరు జిల్లా మంగళగిరి మండలం చినకాకానిలోని ఎన్నారై ఆసుపత్రి భవనం పైనుంచి కరోనా రోగి కిందకు దూకాడు. గుంటూరు మారుతీనగర్‌కు చెందిన నాగమురళి (66)కి కరోనా సోకడంతో ఆసుపత్రిలో గత కొన్ని రోజులుగా చికిత్స పొందుతున్నాడు. శుక్రవారం ఉదయం భవనం మూడో అంతస్తు నుంచి కిందకు దూకడంతో తీవ్రంగా గాయపడ్డాడు. గమనించిన సిబ్బంది అత్యవసర విభాగానికి తరలించి వైద్యసేవలు అందించినప్పటికీ ఫలితం లేకపోయింది. చికిత్స పొందుతూ బాధితుడు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. ఘటనపై వివరాలు సేకరిస్తున్నారు.

* పెళ్లి చేసుకుంటానని యువతిని నమ్మించి దగ్గరైన ఓ వ్యక్తి ఆమెను గర్భిణిని చేసి ముఖం చాటేశాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు.. ఒంగోలు రెండో పట్టణ పోలీసుస్టేషన్‌లో గురువారం కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రెండో పట్టణ పోలీసుస్టేషన్‌ పరిధిలో ఉంటున్న ఓ యువతి స్థానికంగా ఒక దుకాణంలో పనిచేస్తోంది. వరుసకు బావ అయ్యే వ్యక్తి ఆమెను పెళ్లి చేసుకుంటానని దగ్గరయ్యాడు. ఈక్రమంలో రెండుసార్లు యువతి గర్భందాల్చింది. దీంతో అతను ఆమెతో పలు మాత్రలు మింగించి గర్భవిచ్ఛితికి పాల్పడ్డాడు. ప్రస్తుతం ఆమె మరోసారి గర్భిణి కావడంతో.. సదరు వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని కోరింది. అందుకు అతను నిరాకరించాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.