Movies

నెట్‌ఫ్లిక్స్ సిరీస్‌లో

నెట్‌ఫ్లిక్స్ సిరీస్‌లో

అందాల నాయిక కియారా అడ్వాణీ వెబ్‌సిరీస్‌లో అతిథి పాత్రలో తళుక్కుమనబోతుంది. ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్‌ మసాబా గుప్తా జీవితంపై ‘మసాబా మసాబా’ పేరుతో ఓ వెబ్‌ సిరీస్‌ తెరకెక్కుతోంది. ఇందులో ఓ సినిమా హీరోయిన్‌గా కనిపించనుంది కియారా. మసాబా స్టోర్‌కి వెళ్లి ఓ డ్రెస్‌ కొనుగోలు చేసే సన్నివేశంలో ఆమె నటించింది. ఈ సన్నివేశంలో ఎంతో వినోదం పండిందని చెబుతోంది కియారా. ‘‘ఈ చిత్ర నిర్మాత అశ్విని నాకు ఈ వెబ్‌సిరీస్‌ గురించి చెప్పినప్పుడు చాలా బాగా నచ్చేసింది. ఇందులో నువ్వు ఓ గెస్ట్‌రోల్‌ చేస్తే బాగుంటుంది అని నన్ను అడిగినప్పుడు సంతోషంగా ఒప్పుకున్నాను’’అని చెప్పింది కియారా. నెట్‌ఫ్లిక్స్‌లో రానున్న ఈ సిరీస్‌ను సోనమ్‌ నాయర్‌ తెరకెక్కిస్తున్నారు.