Politics

మంత్రులు జిల్లాల్లోనే ఉండాలి

మంత్రులు జిల్లాల్లోనే ఉండాలి

తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జలాశయాలు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. వరదలు రావడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమైపోతున్నాయి. ఈ నేపథ్యంలో వర్షాలు, వరదలపై రాష్ట్ర సీఎం కేసీఆర్‌ ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. ఇప్పటికే సీఎస్‌, డీజీపీ మంత్రులతో సీఎం మాట్లాడారు. వరదల నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశించారు. జిల్లాల పరిస్థితిని సమీక్షించి తగు సూచనలు చేశారు. హైదరాబాద్‌లో రెండు కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఉమ్మడి వరంగల్‌, కరీంనగర్‌ జిల్లాల్లో చెరువులు అలుగుపోస్తున్నాయన్న సీఎం.. మంత్రులు వారి వారి జిల్లాల్లో ఉండి పరిస్థితులను సమీక్షించాలని సూచించారు.