Movies

జగన్ టార్గెట్‌గా ట్వీట్లు

జగన్ టార్గెట్‌గా ట్వీట్లు

సినీ హీరో రామ్ ట్విట్టర్ లో సంచలన కామెంట్స్ చేసారు. అందులో… సీఎం జగన్ పై పెద్ద కుట్ర జ‌రుగుతున్న‌ట్టుంది!!  సీఎంని త‌ప్పుగా చూపించ‌డానికి! మీ కింద ప‌ని‌చేసే కొంత‌మంది మీకు తెలియ‌కుండా పని చేస్తున్నారు. కొన్ని ప‌నుల వ‌ల్ల మీ రెప్యుటేష‌న్ కీ‌, మీ మీద మేం పెట్టుకున్న న‌మ్మ‌కానికి డ్యామేజ్ కలుగుతోంది. వాళ్ల మీద ఓ లుక్కేస్తార‌ని ఆశిస్తున్నాం అని తెలిపారు. అలాగే మరో ట్విట్ లో ఫైర్ + ఫీజు ‌= ఫూల్స్. అంద‌రినీ ఫూల్స్ చేయ‌డానికే విష‌యాన్ని ఫైర్ నుంచి ఫీజు వైపు మ‌ళ్లిస్తున్నారా? ఫీజుల‌ వివ‌ర‌ణ‌మేనేజ్‌మెంట్ బాధ్య‌త‌ల‌ను నిర్వ‌హిస్తున్న స్వ‌ర్ణ‌ప్యాలెస్‌” అంటూ  డైరెక్ట్ గా చేసిన బిల్లింగ్ ను పోస్ట్ చేసారు రామ్. అలాగే హోటల్ స్వర్ణ ప్యాలస్ ని రమేష్ హాస్పిటల్స్ కోవిడ్ సెంటర్ గా మార్చక ముందు , ప్రభుత్వం అక్కడ క్వారంటైన్ సెంటర్ నిర్వహించింది. అప్పుడీ అగ్ని ప్రమాదం  జరిగి ఉంటే ఎవరిని నిందించే వాళ్లు ? అని ప్రశ్నించారు. అయితే ఎవరిని ఉద్దేశించి రామ్ ఈ ట్వీట్ చేసాడు అనేది రాజకీయ, సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.