Devotional

ప్రారంభమైన మాతా వైష్ణో దేవి ఆలయం

ప్రారంభమైన మాతా వైష్ణో దేవి ఆలయం

కరోనా కారణంగా ఆరు నెలలుగా నిలిచిపోయిన మాతా వైష్ణో దేవి యాత్ర తిరిగి ఆదివారం ప్రారంభమైంది. 

ఆలయ దర్శనానికి నిర్వాహకులు  అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. 

2వేల మంది భక్తులకు మాత్రమే ఆలయ దర్శనానికి అనుమతి ఉన్నది.   

జమ్మూ కశ్మీరు నుంచి 1,900 మందిని, బయటి ప్రాంతాలకు చెందిన 100 మంది భక్తులను అనుమతించనున్నారు.

రెడ్‌జోన్ల నుంచి వచ్చే భక్తులు కరోనా నెగెటివ్‌ రిపోర్ట్‌తో రావాలని మాతా వైష్ణోదేవి ఆలయ బోర్డు సీఈవో పేర్కొన్నారు.   

కరోనా వైరస్  నేపథ్యంలో  వైష్ణోదేవి యాత్రకు వచ్చే భక్తులు విషయంలో జమ్ముకశ్మీర్ అధికారులు  ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు.