NRI-NRT

సిలికానాంధ్ర హనుమాన్ చాలీసాకు గిన్నీస్ గౌరవం

సిలికానాంధ్ర హనుమాన్ చాలీసాకు గిన్నీస్ గౌరవం

లక్ష గొంతుల హనుమాన్ చాలీసా – గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ చేకొన్న సిలికానాంధ్ర !

హనుమాన్ లక్ష గళ పారాయణ భారత స్వతంత్ర దినోత్సవం నాడు ఇంటర్నెట్ లో జూం ద్వారా జరిగింది. సిలికానాంధ్ర చేసిన మరో మహా సంకల్పం ఈ కార్యక్రమం. 50 పైగా దేశాలనుండి భారతీయులు పాల్గొన్నారు. పిన్న పెద్దా వయోభేదం లేకుండా గొంతు కలిపి ఒక అద్భుతం సృష్టించారు. ఇంతమంది ఒకేసారి హనుమాన్ చాలీసా అంతర్జాలం లో పారాయణం చేయడం ఒక సాంకేతిక విసేషం కూడా! ఈ విశేషమైన కార్యక్రమాన్ని రూపొందించినది సిలికానాంధ్ర! కూచిపూడి నృత్యం నించి, అన్నమయ్య లక్ష గళార్చన నించి నేటి దాక మొత్తం 10 గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్లు సాధించిన సిలికానాంధ్ర కోవిడ్ ని ఎదుర్కునే మనో బలానికి, సామాజిక, స్థైర్యానికి, శాంతికి ఇటువంటి మనో ఉద్యమాన్ని ప్రారంభించారు. ఈ ప్రపంచ ప్రజాదరణ పొందిన కార్యక్రమంలో అనేక దేశాల వారు ముక్త కంఠంతో హనుమంతుణ్ణి కీర్తించగా దీంట్లో రాష్ట్ర, కేంద్ర మంత్రులు, వైద్యులు, న్యాయవాదులు, కళాకారులు ఇంకా ఎన్నో రంగాలవారు భాషాభేదం లేకుండా పాల్గొని విజయవంతం చేసారు. జల శక్తి శాఖా మంత్రి గజేంద్ర సింగ్ షెఖావత్ ప్రసంగించారు, త్వరలో ప్రపంచం కోవిడ్ బారినుండి బయట పడాలని ఆయన అన్నారు. హనుమత్ శక్తి అందరికీ ఆశీస్సులిస్తుందని అనడమే కాక వారు కూడ చాలీసా పారాయణలో పాల్గొన్నారు. వారణాసి నించి ప్రసిద్ధ సంకట మోచన హనుమాన్ దేవాలయ ప్రధాన అర్చకులు, ప్రపంచ వ్యాప్తం గా అనేకమంది ఆధ్యాత్మిక వేత్తలు, సాధు సత్పురుషులు కూడా అందరితో పాల్గొని దీనికి శోభ తెచ్చారు.

ఈ కార్యక్రమానికి అనేకమంది కార్యకర్తలు, భక్తులు నిరంతరం నెలల తరబది పని చేసారు. కోవిడ్ లో లాక్ డౌన్ లొ ఉన్న అనేకమంది భక్తులకు ఇది ఒక చేతనా స్ఫూర్తి గా దీన్ని రూపొందించారు. దిలీప్ కొండిపర్తి, రాజు చమర్తి, మధు బాబు ప్రఖ్య, ప్రియ తనుగుల, సాయి కందుల, జ్యోతి చింతలపూడి, స్నేహ వేదుల తదితరులు కీలక పాత్ర వహించారు. మురహరి దేవబత్తిని ఈ అనితర సాధ్యమైన టెక్నాలజి రూపొందిచారు. అశోక్ బడ్డి ఈ కార్యక్రమాన్ని అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించగా అనేకమంది దీనికి ఒక తపస్సు గా సహాయం చేశారు. శ్రీ ఆనంద్ కూచిభొట్ల నిజ జీవన సేవ విశిష్టతను చెపుతూ ఈ కార్యక్రమం దైవ శక్తి, మానవ శక్తి కలిపిన మహ చైతన్యం గా, సిలికానాంధ్ర తమ సేవలు సంజీవిని హాస్పిటల్ ద్వారా కూచిపూడి, ఇంకా పక్కనున్న అనేక గ్రామాలలో కోవిడ్ బాధితులకు, సేవలకు వినియోగిస్తున్నాం అన్నారు అందరిని అట్టి సేవా కార్యక్రమాలలో పాల్గొనాలని కోరారు. ప్రముఖ వైద్యులు, దాత శ్రీ లక్కిరెడ్డి హనుమిరెడ్డి గారు మాట్లాడుతూ మంచి పనుల వెనక తామెప్పుడూ ఉన్నాం అని, హనుమత్ శక్తి కోసం, రామ మందిరం వృద్ధి కోసం తమలాంటి వారు ఎన్నో చెయాలనుకుంటున్నారని చెప్పారు.

బలం, బుద్ధి, పరాక్రమం మూర్తీభవించిన శక్తి హనుమాన్ శక్తి, అది మన అందరికి కావాలి అని భారత జలశక్తి శాఖా మంత్రి శ్రి గజేంద్ర సింగ్ షెఖావత్ గారు అన్నారు. శ్రీ గంగపురం కిషన్ రెడ్డి గారు, మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ హోం మాట్లాడుతూ సిలికానాంధ్ర భారత సనాతన ధర్మాన్ని భావి తరాలకి అందిస్తోంది అని అన్నారు. ప్రయాగ్ నుండి స్వామి ఆనంద్ గిరి మాట్లాడుతూ ఇది సిలికానాంధ్ర అందరి తరపునా కరోనా మహమ్మారి నుంచి రక్షించేందుకు చేసిన అద్భుత అనుష్ఠానం అన్నారు. శ్రీ మిశ్రా, మహంత్, సంకత మోచన హనుమాన్ దేవాలయం కాశి నుండి మాట్లాడుతూ సంకటములను నివారించే స్వామి హనుమంతుడే అని సాక్షాత్ తులసిదాస్ చెప్పారు అన్నారు. సిలికానాంధ్ర విశ్వ సంకల్పాన్ని ఆశీర్వదించారు. మధు ప్రఖ్యా మాట్లాడుతూ రామ నామం రాళ్ళనైన తేలిక చెస్తుంది, వారధి గా మారుస్తుంది, రామ నామాన్ని మంచి మనసుతో మన సమస్యల మీద రాద్దాం, కరోనాని జయిద్దాం అన్నారు. కార్యక్రమానికి ప్రియ తనుగుల సమన్వయ కర్తగా ఉండి మహా కార్యక్రమానికి దివ్య శోభను చేకూర్చారు. ఏ. వీ. యస్. రావ్ గారు, జాయింట్ డైరక్టర్ ఆఫ్ రైల్వేస్, సుప్రీం కోర్ట్ సీనియర్ అడ్వోకేట్ శ్రీ మోహన్ పరాశరన్ గారు ఇందులో పాల్గొన్నారు. ఆయన తండ్రి గారు శ్రీ కేశవ పరాశరన్ గారు రామ జన్మభూమి తీసుకొచి విజయం సాధించిన న్యాయవాది. ఇలా ఎందరో ప్రముఖులతో శక్తివంతం గా ఆబాల గోపాలం తో లక్ష మంది పైగా కలిసిన ఈ కార్యక్రమం గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ల లోకి మరో సారి ఎక్కి భారతీయులంతా గర్వ పడేలా చేసింది.
SiliconAndhra Guinness Laksha Hanuman Chaaleesa Chalisa