NRI-NRT

ఎయిర్‌ఫోర్స్-1 సమీపంలోకి డ్రోన్

ఎయిర్‌ఫోర్స్-1 సమీపంలోకి డ్రోన్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రయాణిస్తున్న ఎయిర్‌ఫోర్స్‌-1 విమానానికి త్రుటిలో ప్రమాదం తప్పింది. ఆదివారం రాత్రి వాషింగ్టన్‌ సమీపంలోని విమానాశ్రయంలో ఎయిర్‌ఫోర్స్‌-1 దిగబోతుండగా గాలిలో ఎగురుతూ వచ్చిన డ్రోన్‌ ఒకటి దానికి కుడివైపున అత్యంత సమీపానికి రావటాన్ని ఆ విమానంలో ఉన్న ప్రయాణికులు గమనించారు. పసుపు, నలుపు రంగులో ఉన్న ఆ డ్రోన్‌ దాదాపు విమానాన్ని ఢీకొట్టినంత పనిచేసిందని, అయితే ప్రమాదం జరగలేదని తెలిపారు. ఈ అంశంపై సీక్రెట్‌ సర్వీస్‌ దర్యాప్తు జరుపుతోంది.