Politics

కావలిలో వైకాపా నేతల ఇళ్లస్థలాలు కబ్జా

కావలిలో వైకాపా నేతల ఇళ్లస్థలాలు కబ్జా

కావలిలో జగనన్న ఇళ్ల స్థలాల భూముల సేకరణలో భారీగా ఇన్ సైడ్ ట్రేడింగ్‌కి  ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి తెరతీశారు. ఒకే రోజు పన్నెండు మంది పేర్లపై 13ఎకరాల భూములను రిజిస్ట్రేషన్ చేయించారు. నిరుపేదలైన వారంతా ఎమ్మెల్యే కార్యాలయ సిబ్బంది, వైసీపీ నేతల వద్ద పనిచేసే వారే కావడం గమనార్హం. ఎకరా భూమిని రూ.12లక్షలకు కొనుగోలు చేసి, రూ.59లక్షల చొప్పున ప్రభుత్వానికి ప్రతిపాదనలు చేశారు. మొత్తం మీద రూ.33కోట్లు స్వాహాకి రంగం సిద్ధమైంది. ఏబీఎన్ పరిశోధనలో అసలు వాస్తవాలు వెలుగు చూశాయి. ఇన్‌ సైడ్ ట్రేడింగ్‌కు సంబంధించిన కీలక ఆధారాలు ఏబీఎన్ చేతికి చిక్కాయి. ఈ వ్యవహారంలో అధికారులపై ఎమ్మెల్యే, మంత్రులు తీవ్ర ఒత్తిళ్లు తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. గతంలో పనిచేసిన కలెక్టర్, సబ్ కలెక్టర్ బదిలీ వేటు పడింది. మ్యూటేషన్ కుదరదన్న జాయింట్ కలెక్టర్‌పైనా బదిలీ వేటు పడింది.  మూడు రోజులకే ఆర్డీవో శెలవుపై వెళ్లిపోయారు.