DailyDose

రష్యా టీకా కోసం భారత్ చర్చలు-TNI బులెటిన్

రష్యా టీకా కోసం భారత్ చర్చలు-TNI బులెటిన్

* 9652 new case in AP today

* ప్రపంచంలో తొలి కరోనా వ్యాక్సిన్‌ను ఆవిష్కరించినట్లు రష్యా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ వ్యాక్సిన్‌పై పలు దేశాలు ఆసక్తి చూపిస్తున్నాయి. భారత్‌ కూడా టీకా సమాచారాన్ని పరిశీలిస్తోంది. ఇందులో భాగంగా టీకా పరిశోధకులతో మాస్కోలోని భారత రాయబార కార్యాలయం చర్చిస్తున్నట్లు సమాచారం.

* రమేష్ హాస్పిటల్ 20 వేలకు పైగా శస్త్ర చికిత్సలు చేసి ప్రాణాలు కాపాడిందని మాజీ మంత్రి దేవినేని ఉమ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.ట్విట్టర్ పోస్టు పెట్టినందుకు హీరో రామ్‌ పోతినేనికి బెదిరిస్తారా? అని ప్రశ్నించారు. ‘‘32 ఏళ్లుగా 2 వేలకు పైగా సిబ్బందితో నెలకి 20వేల ఓపీ, 1500 పైగా ఇన్ పేషెంట్స్‌కి సేవలు.1,25,000 పైగా cath, 20 వేలకు పైగా శస్త్ర చికిత్సలు చేసి ప్రాణాలు కాపాడిన రమేష్ హాస్పిటల్స్.ట్విట్టర్‌లో పోస్ట్ పెట్టిన రామ్‌కు బెదిరింపులా? ఎంతో మందికి ప్రాణదాత రమేష్‌ను అరెస్టు చేసేందుకు ఎందుకంత ఉత్సాహం’’ అంటూ సీఎం జగన్‌ను ఉద్దేశించి దేవినేని ఉమ ట్వీట్ చేశారు

* కరోనా వ్యాక్సిన్ ధర నుంచి ఉత్పత్తి వరకూ… కేంద్రానికి వివరాలు వెల్లడించిన ఫార్మా కంపెనీలు!వ్యాక్సిన్ అడ్మినిస్ట్రేషన్ పై కమిటీకమిటీతో సమావేశమైన ఫార్మా కంపెనీలుపాల్గొన్న భారత్ బయోటెక్, జైడస్ కాడిలా, సీరమ్ తదితరాలువ్యాక్సిన్ సిద్ధమైతే తయారీకి ప్రభుత్వ సాయంఇండియాలో కరోనా వైరస్ ను అడ్డుకునేందుకు వ్యాక్సిన్ తయారీలో నిమగ్నమైన ఐదు ఫార్మా కంపెనీలు, జాతీయ నిపుణుల కమిటీతో సమావేశమై, పురోగతిని వివరించాయి.వ్యాక్సిన్ వస్తే, దాని ధర ఎంతవరకూ ఉంటుంది? ఎన్ని రోజుల్లో ఎన్ని డోస్ లను ఉత్పత్తి చేయగలుగుతాం? అనే విషయాలపై ఈ సంస్థలు వ్యాక్సిన్ అడ్మినిస్ట్రేషన్ పై ఏర్పాటు చేసిన కమిటీకి సమాచారాన్ని అందించాయి.ప్రస్తుతం ఇండియాలో భారత్ బయోటెక్ సంస్థ కోవాగ్జిన్ ను, జైడస్ కాడిలా సంస్థ జైకోవిడ్ ను తయారు చేస్తుండగా, ఇవి రెండూ పూర్తి స్వదేశీ వ్యాక్సిన్ లు.

* తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. సోమవారం(17వ తేదీ) రాత్రి 8 గంటల వరకు కొత్తగా 1682 కరోనా పాజిటివ్‌ కేసులు.. ఎనిమిది మరణాలు నమోదైనట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 235, రంగారెడ్డి‌ జిల్లాలో 166 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య మొత్తంగా 93,937కి చేరింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా నుంచి 72,202 మంది కోలుకోగా.. 21,024 మంది చికిత్స తీసుకుంటున్నారు. వ్యాధి బారినపడి ఇప్పటి వరకు 711మంది ప్రాణాలు విడిచారు. నిన్న ఒక్కరోజు 19,579 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు ప్రభుత్వం వెల్లడించింది.