Kids

ఏపీలో ప్రీస్కూల్ విద్యకు మార్గదర్శకాలు జారీ

ఏపీలో ప్రీస్కూల్ విద్యకు మార్గదర్శకాలు జారీ

తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో విద్యాశాఖ, మహిళా, శిశుసంక్షేమశాఖ అధికారులతో ముఖ్యమంత్రి జగన్‌ సమీక్షించారు. సమావేశంలో ప్రీస్కూల్‌ ఎడ్యుకేషన్‌లో ప్రీ ప్రైమరీ-1,2లపై చర్చించారు. ప్రీస్కూల్‌ ఎడ్యుకేషన్‌పై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని సీఎం జగన్‌ చెప్పారు. ఇందులో భాగంగా అంగన్‌వాడీ కేంద్రాలను ఇక నుంచి ప్రీప్రైమరీ స్కూళ్లుగా మార్చుతామన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ…అంగన్‌వాడీ కేంద్రాల్లో ప్రీస్కూల్‌ ఎడ్యుకేషన్‌ కొరకు రూ.4వేల కోట్లు ఖర్చు చేయనున్నామని అన్నారు. నిధుల సమీకరణపై ఆర్థికశాఖ అధికారులు ప్రణాళికలు వేయాలని తెలిపారు. నాడు-నేడు కార్యక్రమం కింద అంగన్‌వాడీల్లో అభివృద్ధి పనులు చేపట్టాలన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో ప్రీప్రైమరీకి కొత్త పాఠ్యప్రణాళికలు అమలు చేయాలని ఒకటో తరగతి పాఠ్యప్రణాళికతో ట్రాన్సిషన్‌ ఉండాలని అన్నారు. ఈ ప్రత్యేక పాఠ్య ప్రణాళిక తయారీ బాధ్యత విద్యాశాఖ చేపట్టాలని ఆదేశించారు. అంగన్‌వాడీ వర్కర్లకు ఇప్పుడున్న కనీస విద్యార్హత పదో తరగతి కాగా, వారికి ఏడాదిపాటు డిప్లొమా కోర్సు నిర్వహించాలని తెలిపారు