Business

మస్క్‌ను వెంటాడుతున్న అంబానీ

మస్క్‌ను వెంటాడుతున్న అంబానీ

ప్రపంచ కుబేరుల జాబితాలో టెస్లా సీఈఓ ఎలన్‌ మస్క్‌ నాలుగో స్థానానికి చేరారు. బ్లూమ్‌బర్గ్‌ బిలియనీర్స్‌ ఇండెక్స్‌ ప్రకారం.. ఆయన సంపద 84.8 బిలియన్‌ డాలర్లకు పెరిగింది. టెస్లా షేర్లు దాదాపు 11 శాతం దూసుకెళ్లడమే ఇందుకు కారణం. ఫ్రాన్స్‌ కుబేరుడు బెర్నార్డ్‌ ఆర్నాల్ట్‌ను మస్క్‌ వెనక్కి నెట్టడం విశేషం. ఇక ఫేస్‌బుక్‌ అధిపతి మార్క్‌ జుకర్‌బర్గ్‌కు 15 బిలియన్‌ డాలర్ల దూరంలో నిలిచారు. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఛైర్మన్‌ ముకేశ్‌ అంబానీ 78.8 బిలియన్‌ డాలర్ల సంపదతో ఆరో స్థానంలో నిలిచారు. ఆగస్టు 8న ఆయన నాలుగో స్థానంలో ఉన్న విషయం తెలిసిందే.