Movies

ఎస్పీబీ పరిస్థితిపై ఓ శుభవార్త

ఎస్పీబీ పరిస్థితిపై ఓ శుభవార్త

ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితిపై ఆయన సోదరి ఎస్పీ శైలజ స్పందించారు. కరోనాతో పోరాడుతూ చెన్నై ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఎస్పీబీ ఆరోగ్య పరిస్థితి కాస్త ఆందోళనకరంగా ఉండటంతో ఆయనకు వెంటిలేటర్‌ సాయంతో ప్రాణవాయువు అందిస్తున్నారు. తాజాగా ఎస్పీబీ కాస్త కోలుకున్నారని, వెంటిలేటర్ సాయం లేకుండా ఆయన శ్వాస తీసుకుంటున్నారని ఆమె అన్నారు.