Food

హోమియోపతిలో బంగారం వాడతారు తెలుసా?

హోమియోపతిలో బంగారం వాడతారు తెలుసా?

ఈ సృష్టిలో, ప్రకృతిలో దొరికే ప్రతి వస్తువులో ఆరోగ్య మూలాలున్నాయి. అందమైన బంగారం, వెండి, రాగి, మిశ్రమ లోహం ఇత్తడిల్లో కనిపించే తళుకుల వెనక దాగివున్న ఔషధగుణాలు అపారం. వేగవంతమైన జీవన ప్రయాణంలో ఎదురవుతున్న ఒత్తిడి, నిద్రలేమి వంటి కొన్ని లోహాలను ఉపయోగించి ఆహారం తయారు చేసుకొంటే అనారోగ్యాలు దూరం అవుతాయంటారు పరిశోధకులు. కీళ్ళనొప్పులకు బంగారం, న్యూమోనియాను తగ్గించే వెండి, నీటికి సంబంధించిన వ్యాధులను నయం చేయగలిగే ఇత్తడి, ఆ నీటిని శుద్ధి చేయగలిగే రాగి మొదలైన లోహాలు ఆరోగ్య ప్రదాతలు. ఆరోగ్యానికీ, లోహాలకు, ఖనిజాలకు మధ్య సంబంధం ఉందంటారు ఆధునిక శాస్త్రజ్ఞులు. పారాసైన్స్ కూడా దీన్ని నిర్ధారిస్తోంది. ఆభరణాల తయారీలో ఉపయోగించే వెండి, రాగి, ఇత్తడి వంటి లోహాల్లో ఆరోగ్యాన్ని ఆయుష్షునీ, తేజస్సును ఇచ్చే లక్షణాలు ఎన్నో ఉన్నాయి. ఇందులో ఔషధగుణాలు కూడా ఎక్కువే.
***బంగారం
సంప్రదాయ భారతీయ వైద్యం, హోమియో వైద్యంలో సిఫార్స్ చేసే ఎన్నో ఔషధాల తయారీలో బంగారం ఉపయోగిస్తారు. స్వర్ణభస్మం కీళ్ళరోగానికి అద్భుతమైన మందుగా చెబుతారు. బంగారంలోని కొన్ని లవణాలలో యాంటీ ఇన్ ఫ్లమేటరీ, యాంటీబాక్టీరియల్ లక్షణాలు రక్త ప్రసరణను, మెరుగుపరచటంలో కీళ్లనొప్పులు, వాపులు తగ్గించటంలో పనికి వస్తాయి. అయితే లోహరూపంలోని బంగారం శరీరం లోపల అన్ని రసాయనాలు ఎదుర్కోలేదు. దాన్ని వందల సార్లు కరిగించి, ఔషధాల్లో వాడతారు. ఇక సౌందర్యరూపంగా బంగారం ఎన్ని రూపాల్లో ఒదిగిపోతుందో తరాల నుంచి చూస్తునే ఉన్నాం. ఈ ఖరీదైన బంగారాన్ని కంప్యూటర్, ఎలక్రానిక్, పరికరాల్లో, వ్యోమగాముల దుస్తుల తయారీలో వాడతారు. బంగారం ఎంత మెత్తనిదీ, సాగేగుణం ఉన్నదీ అంటే ఒక గ్రాము బంగారంతో 20 మైక్రోమీటర్ల మందమున్న 165 మీటర్ల పొడవున తీగలా తయారు చేయవచ్చు. ఈ దారాలను దుస్తుల ఎంబ్రాయిడరీల్లో కూడా వినియోగిస్తారు.
**వెండి
ఇక ఆభరణాలు, వస్తువుల తయారీలోనే కాదు ఆయుర్వేద వైద్యంలో వెండి ఉపయోగాలు ఎన్నో ఉన్నాయి. ఈ వెండిలో స్వస్థత నిచ్చే రోగనిరోధక ఆరోగ్య పరిరక్షణ గుణాలున్నాయి. పసిబిడ్డల నోటిలో ఏర్పడే బ్యాక్టీరియాను వెండిని చప్పరిస్తే నిర్మూలించవచ్చుననే నమ్మకం లోంచి శిశువుకు వెండి చెంచాలు, ఉగ్గు గిన్నెలు, పాల బుడ్డీలు, టీతింగ్ రింగ్స్ కానుకగా ఇస్తారు. వెండి ఉంగరాలు, కడియాలు ధరిస్తే ఆర్థరైటిస్ లక్షణాలు తగ్గుతాయని, హైపర్‌టెన్షన్ అదుపులో ఉంటుందనీ, కీళ్ళ అనారోగ్యాలు దూరం అవుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ తెల్లని అందమైన లోహంతో బ్యాక్టీరియాని నాశనం చేసే గుణాలున్నాయి. రోగుల పొట్టలోకి ఆహారం పంపే కాథటర్స్‌ని వెండితోనే తయారు చేస్తారు. ఔషధ ప్రయోజనాలున్నాయనే దృష్టితో దీన్ని ఆహారంలో కూడా వాడతారు. హిందూదేవతలు దేవుడికి ఉపయోగించే పాత్రలు వెండితోనే చేస్తారు. పురాణాల్లో శివుడి నివాసమైన ప్రాంతాన్ని వెండికొండతో పోల్చారంటే వెండికి ఉన్న ప్రత్యేకత ఆనాడే గుర్తించారని అర్థం. ఏదైన ఒక సంస్థ ఏర్పడి ఒక సంవత్సరం నిండితే రజతోత్సవాన్ని జరుపుకొంటారు.
**రాగి
ఇక రాగి అపారమైన ఔషధగుణాలు కలిగిన లోహాలలో ఒకటి. ఇది కాలుష్యాన్ని నివారిస్తుంది అంటారు. గొంతుకు సంబంధించిన అనేక అనారోగ్యాలు కంటి ఇన్ఫెక్షన్స్, చర్మ రోగాలు నయం చేసేందుకు ప్రపంచవ్యాప్తంగా ఎన్ని నాగరికతల్లో రాగిని వినియోగించారు. రాగిలో యాంటీమైక్రోబియల్ లక్షణాలు ఉన్నాయి. బ్యాక్టీరియా వ్యాప్తి చెందకుండా అనేక ఉపకరణాలపైన ఈ రాగి పూత పూస్తారు. స్వచ్ఛమైన రాగి కడియం ధరిస్తే ఆర్థరైటిస్, రుమటైజ్‌డ్ ఆర్థరైటిస్ నొప్పులకు ఉపశమనం కలుగుతోందని 75 శాతం మంది ప్రజలు నమ్మకాలు. ఈ రాగితో వెండి, బంగారం, తగరం,సీసం వంటి లోహాలు మిశ్రమ నిష్పత్తిలో కలిపి మిశ్రమ లోహాలు తయారు చేస్తారు. రాగి పాత్రల్లో నిల్వ చేసిన నీటిని తాగితే శరీరానికి కెరొటెన్ రాగి దాదాపు అందుతోంది. ఆహారం ద్వారా శరీరానికి అందే రాగి వల్ల కార్డియో వాస్కూలర్ వ్యవస్థ బాగా పనిచేస్తుంది. నీటిని శుద్ధిచేయటంలో రాగి ఉపయోగపడుతోందనే నమ్మకంతో రాగి బిందెలు, పాత్రలు తయారు మొదలైంది. ఇప్పుడు రాగి వాటర్ బాటిల్స్ వాడటం కూడా మొదలైంది.
**ఇత్తడి
రాగి జింక్‌ల మిశ్రమ లోహం ఇత్తడి. పూర్వీకులు మంచి ఆరోగ్యం కోసం తాగు నీటిని ఇత్తడి పాత్రల్లో నిల్వ చేసేవాళ్ళు. నీటి ద్వారా వ్యాప్తి చెందే వృద్ధులు ఎదుర్కొనేందుకు ఇత్తడి పాత్రల్లో నిల్వ చేసిన నీళ్ళు ఇత్తడి పాత్రలతో వండిన ఆహారం తీసుకోవటం అలవాటు చేసుకొన్నారు. దీన్ని పలచటి రేకులుగా మార్చి ఇంటికి ఉపయోగపడే ఎన్నో పాత్రలు తయారు చేస్తారు. విద్యుత్ ఉపకరణాలు, బోల్డ్‌లు, నట్టులు, రేడియేటర్ అంతర్భాగాలు తయారు చేస్తారు. పెళ్లి, ఇతర శుభకార్యాల్లో ఇత్తడి బిందెలు, పళ్లాలు వాడతారు. దీన్ని ఎంత విలువైన పూజనీయమైన వస్తువుగా పరిగణిస్తారంటే దేవాలయాల్లో పూజల్లో ఉపయోగించే గంటలు, దేవాలయ ద్వారాలు ధ్వజ స్తంభాలు చేసేందుకు ఉపయోగించే ప్రధాన లోహం ఇత్తడే. శాస్త్రవేత్తలు కొన్ని మట్టి పాత్రలు ఇకొలి బ్యాక్టీరియా డైల్యూటెడ్ కల్చర్‌తో నింపారు. ఈ బ్యాక్టీరియానే నీళ్లతో వ్యాపించే డిసెంట్రీ వంటి రుగ్మతలకు కారణం అవుతోంది. కొన్ని గంటల తర్వాత ఈ బ్యాక్టీరియా క్షీణించి పడిపోయింది. ఇదే బ్యాక్టీరియాను ఇత్తడి గిన్నెలలో ఉంచి పరిశోధన చేస్తే నీటి ద్వారా వచ్చే బ్యాక్టీరియా అయినా ఎనిమిది గంటల్లోనే నిర్మూలనం అవుతోందని తేలింది. ఇత్తడి వంట పాత్రల్లో వండిన ఆహారం తినటం వల్ల జింక్‌లోపం తగ్గిపోతోంది. రోగనిరోధక వ్యవస్థ మెరుగవుతోంది జీవక్రియల్ని అదుపుచేస్తుంది. ముఖ్యంగా మధుమేహంతో బాధపడేవాళ్ళకు ఇత్తడి పాత్రల వాడకం లాభదాయకం.