Health

ఆస్ట్రేలియా ప్రజలకు ఉచితంగా కరోనా టీకా-TNI బులెటిన్

ఆస్ట్రేలియా ప్రజలకు ఉచితంగా కరోనా టీకా-TNI బులెటిన్

* సచివాలయంలో పశు సంవర్ధక శాఖలో సెక్షన్ ఆఫీసర్ గా విధులు నిర్వహిస్తున్న మధుసూదన్ కరోనాతో మృతి చెందారు. గత కొన్ని రోజులుగా హైదరబాదులోని ఒక కార్పోరేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన బుధవారం మృతి చెందారు.

* Spike of 69,652 cases and 977 deaths reported in India, in the last 24 hours.The #COVID19 tally in the country rises to 28,36,926 including 6,86,395 active cases, 20,96,665 cured/discharged/migrated & 53,866 deaths: Ministry of Health and Family Welfare

* దేశ ప్రజలందరికీ ఫ్రీగా కరోనా వ్యాక్సిన్ అందజేస్తామని ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్ స్కాట్ మోరిసన్ ప్రకటించారు. ఇందుకోసం ఆస్ట్రాజెనికా కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నామని తెలిపారు. ఆస్ట్రాజెనికా కంపెనీ ఆక్స్ ఫర్డ్యూనివర్సిటీ తో కలిసి వ్యాక్సిన్ డెవలప్ చేస్తోంది. ‘‘ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ తయారీ అడ్వాన్స్ డ్ స్టేజ్ లో ఉంది. ప్రపంచ వ్యాప్తంగా తయారు చేస్తున్న వ్యాక్సిన్లలో ఆక్స్ ఫర్ట్టీకా రిజల్స్ట్ ఆశాజనకంగా ఉన్నాయి. ఒకవేళ ఈ వ్యాక్సిన్ సక్సెస్ అయితే, మా దేశంలోనే తయారు చేసి ప్రజలందరికీ ఫ్రీగా అందజేస్తాం” అని మోరిసన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆయన బుధవారం సిడ్నీలోని ఆస్ట్రాజెనికా లేబోరేటరీని సందర్శిం చారు. ‘‘ఇదే వ్యాక్సిన్ లేదా మరేదైనా సక్సెస్ అవుతుందా? అనే గ్యారంటీ లేదు. అందుకే వ్యాక్సిన్ కోసం వరల్డ్వైడ్ గా చాలా పార్టీలతో చర్చలు జరుపుతున్నాం” అని మోరిసన్ చెప్పారు. ఈ డీల్ ఇంకా ప్రారంభ దశలోనే ఉంది. ఫైనల్ అగ్రిమెంట్ అయినంకనే వ్యా క్సిన్ ధర, డిస్ట్రిబ్యూషన్ పై క్లారిటీ వస్తుంది. థర్డ్ ఫేజ్లో వ్యాక్సిన్ ట్రయల్స్ ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ ట్రయల్స్ థర్డ్ ఫేజ్ లో ఉన్నాయి. సెప్టెంబర్ లోనే ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తామంది. వ్యాక్సిన్‌‌‌‌ 300 కోట్ల డోసులకు కోసం వివిధ దేశాలతో ఆస్ట్రాజెనికా ఇప్పటికే డీల్‌‌‌‌ చేసుకుంది.

* భారత్‌లో కరోనా వైరస్ మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. నిత్యం రికార్డుస్థాయిలో కేసులు బయటపడుతున్నాయి. నిన్న ఒక్కరోజే అత్యధికంగా 69,652 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దేశంలో 24గంటల వ్యవధిలో ఇన్ని కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. దీంతో గురువారం నాటికి దేశంలో కరోనా కేసుల సంఖ్య 28,36,925కు చేరినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ వెల్లడించింది. వీరిలో ఇప్పటి వరకు 20లక్షల 96వేల మంది కోలుకోగా మరో 6లక్షల 86వేల క్రియాశీల కేసులు ఉన్నాయి. పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరగుతున్నప్పటికీ కోలుకుంటున్న వారిసంఖ్య క్రమంగా పెరుగుతోంది. నిన్న ఒక్కరోజే 58వేల మంది కోలుకున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 74శాతానికి చేరింది. మరణాల రేటు 1.9శాతంగా ఉంది

* కేంద్ర జల శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షకావత్ కు కరోనా పాజిటివ్ఆసుపత్రిలో చేరనున్న శకావత్స్వయంగా ట్విట్టర్లో తెలిపిన షకవత్ఈ నెల 25 న జరగాల్సిన అపెక్స్ కౌన్సిల్ సమావేశం వాయిదా పడే అవకాశం