NRI-NRT

బండ్ల మాధవరావుకు తానా ప్రథమ బహుమతి

బండ్ల మాధవరావుకు తానా ప్రథమ బహుమతి

అంతర్జాతీయ ఫొటోగ్రఫీ (ఆగస్టు 19)ని పురస్కరించుకుని తానా ఆధ్వర్యంలో నిర్వహించిన ఫొటో కవితల పోటీలో విజయవాడకు చెందిన బండ్ల మాధవరావు ప్రథమ బహుమతి సాధించారు. విజేతకు నగదు పురస్కారం కింద రూ.30వేలు అందించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. సింధు రావులపాటి, కె.వి మన్ ప్రీతం ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు. వీరికి రూ.20 వేలు, రూ.10వేలు చొప్పున నగదు అందజేయనున్నారు. వీరితో పాటు ఉత్తమ కవితలు పంపిన మరో 10 మందికి రూ.4వేలు చొప్పున బహుమతి ప్రదానం చేయనున్నారు.