Food

పల్లీ పకోడీ చేసుకుందామా?

పల్లీ పకోడీ చేసుకుందామా?

*** కావలసిన పదార్థాలు
పల్లీలు : ఒక కప్పు, శనగపిండి : ఒక కప్పు, బియ్యపు పిండి : రెండు స్పూను,్ల జీలకర్ర : స్పూను, తరిగిన అల్లం ముక్కలు : స్పూనున్నర, తరిగిన కరివేపాకు : కొద్దిగా, తరిగిన కొత్తిమీర :కొద్దిగా కారం : స్పూను, ఉప్పు : తగినంత సోడా ఉప్పు : చిటికెడు, నూనె : అర కేజీ

*** తయారు చేసే విధానం:
పల్లీలు పొట్టుతోనే మూడు గంటలు తగినన్ని నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. తర్వాత కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. అందులో శనగపిండి, బియ్యపు పిండి, తరిగిన ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర, కారం, ఉప్పు, సోడా, ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసుకుంటూ గట్టిగా కలుపుకోవాలి. ఆ తర్వాత కడాయిలో నూనె పోసుకోవాలి. నూనె బాగా కాగిన తర్వాత పకోడీలు వేసుకొని బంగారు రంగు రాగానే తీయాలి. అంతే వేడి వేడి పల్లీ పకోడీలు సిద్ధం.