DailyDose

బాలుకి కరోనాపై గాయని మాళవిక కేసు-TNI బులెటిన్

బాలుకి కరోనాపై గాయని మాళవిక కేసు-TNI బులెటిన్

* ఏపీలో గడచిన 24 గంటల్లో నమోదైన కరోనా మరణాలు, పాజిటివ్ కేసులకు సంబంధించిన బులెటిన్ ను రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసింది. కొత్తగా 9,544 పాజిటివ్ కేసులు వెల్లడి కాగా, అదే సమయంలో 91 మంది వైరస్ మహమ్మారికి బలయ్యారు. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 16 మంది మరణించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో 13 మంది, నెల్లూరు జిల్లాలో 12 మంది, తూర్పు గోదావరి జిల్లాలో 11 మంది మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటిరకు కరోనాతో కన్నుమూసిన వారి సంఖ్య 3,092కి పెరిగింది.కాగా, చిత్తూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో తాజాగా వెయ్యికి పైగా పాజిటివ్ కేసులు గుర్తించారు. ప్రస్తుతం 87,803 మంది చికిత్స పొందుతుండగా, మరో 8,827 మంది కరోనా నుంచి విముక్తులయ్యారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 3,34,940 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 2,44,045 మంది కోలుకున్నారు.

* కరోనా వల్ల ఏర్పడిన సంక్షోభంతో ఉద్యోగాలు కోల్పోయిన వారిని ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగాలు కోల్పోయిన నిరుద్యోగులకు  నిరుద్యోగ భృతిగా 50 శాతం జీతాన్ని మూడు నెలలుగా ఇవ్వాలని నిర్ణయించింది. రాష్ట్ర ఇన్స్యూరెన్స్ ESIC  కార్పొరేషన్‌లో సభ్యులుగా ఉన్న ప్రతీ ఒక్కరికీ ఇది వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఈ ఏడాది మార్చి 24 నుంచి డిసెంబర్ 31 వరకు కరోనా విపత్తు కారణంగాఉద్యోగాలు కోల్పోయినవారికి నిరుద్యోగ భృతి ఇవ్వనున్నారు. ఈ పథకాన్ని 2021, జూన్ 30వ తేదీ వరకు పొడిగించాలని ఈఎస్ఐసీ నిర్ణయించింది. మరోవైపు ప్రస్తుతం ఉన్న పరిస్థితులకు తగ్గట్టుగా ఈ స్కీంను పొడిగించడంతో పాటు నిరుద్యోగ భృతిని కూడా పెంచాలని అధికారులు నిర్ణయించారు. ఈ పథకం ద్వారా 30 లక్షల నుంచి 35 లక్షల మందికి లబ్ది చేకూరనుంది.

* ప్రఖ్యాత సినీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కరోనా మహమ్మారితో పోరాడుతున్నారు. అయితే ఆయనకు కరోనా సోకడానికి తానే కారణం అంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని ప్రముఖ గాయని మాళవిక వాపోయారు. దీనిపై ఆమె సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనపై అసత్య ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.

* ప్రపంచంలో మొదటి కరోనా వాక్సిన్ ను రిలీజ్ చేసిన రష్యా మూడో దశ క్లినికల్ ట్రయల్స్ ను నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నది.  ఇప్పటికే రెండు దశల్లో ట్రయల్స్ ను నిర్వహించిన రష్యా మూడో దశ ట్రయల్స్ ను భారీ ఎత్తున నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నది.  మూడో దశలో ఏకంగా 40 వేల మంది వాలంటీర్లపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నది. రెండు దశల ట్రయల్స్ కు సంబంధించిన డేటాను ఇప్పటి వరకు ప్రపంచానికి అందివ్వలేదు.  రష్యా ట్రయల్స్ కు సంబంధించి తమ వద్ద ఎలాంటి డేటా లేదని ప్రపంచ ఆరోగ్యసంస్థ పేర్కొన్నది.  దీంతో మూడో దశ ట్రయల్స్ కు చేయబోతున్నట్టు ప్రకటించింది.  వచ్చే వారమే మూడో దశ క్లినికల్ ట్రయల్స్ ను ప్రారంభం చేయబోతున్నట్టు ప్రకటించింది.  

* తెలంగాణ‌లో క‌రోనా కేసుల తీవ్ర‌త కొన‌సాగుతూనే ఉంది.. రాష్ట్రవ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య ల‌క్ష‌కు చేరువైంది. ఈ మ‌ధ్య కాస్త త‌గ్గిన క‌రోనా పాజిటివ్ కేసులు మ‌ళ్లీ పెరుగుతున్నాయి… తెలంగాణ వైద్య ఆరోగ్య‌శాఖ విడుద‌ల చేసిన తాజా క‌రోనా హెల్త్ బులెటిన్ ప్ర‌కారం.. గ‌త 24 గంట‌ల్లో కొత్త‌గా 1,967 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి… ఇదే స‌మ‌యంలో 8 మంది క‌రోనాబాధితులు మృతిచెందారు.. దీంతో… క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 99,391కి చేరుకోగా.. ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనాబారిన‌ప‌డి 737 మంది మృతిచెందారు.