Fashion

మంగళసూత్రంలో ముత్యం జేరితే…

మంగళసూత్రంలో ముత్యం జేరితే…

మహిళలు మంగళ సూత్రాల్లో పగడాన్ని, ముత్యాన్ని ధరించడం ద్వారా దీర్ఘసుమంగళీ ప్రాప్తం చేకూరుతుంది. ఆడవారు మంగళ సూత్రాలలో పగడాన్నీ, ముత్యాన్నీ ధరిస్తారు. అవి కేవలం అలంకారప్రాయంగా కాకుండా ఆడవారికి ఎంతో మేలు చేస్తాయి. మంగళ సూత్రాలు స్త్రీ పసుపు కుంకుమలతో పాటుగా ఆమె ఆరోగ్యాన్ని కూడా పరిరక్షిస్తాయి.పగడం సూర్యునికి, కుజునికి, ముత్యం చంద్రునికి ప్రతీకలు. ఆ రెండూ సూర్య, చంద్ర తేజాలను తమలో నిక్షిప్తం చేసుకుని ఉంటాయి. స్త్రీ శరీరానికి కావలసిన ఉత్తేజాన్ని పగడం అందిస్తుంది. నాడీ మండలాన్ని చురుకుగా ఉంచుతుంది. ముత్యం అతివేడిని తగ్గిస్తుంది. ప్రశాంతతను సహనాన్ని ప్రసాదిస్తుందని ఆధ్యాత్మిక నిపుణులు సూచిస్తున్నారు.
అలాగే మహిళలు బొట్టు పెట్టుకునే భాగం.. ముఖ్యమైన నరం ఉంటుంది. శరీరం కోల్పోయిన ఎనర్జీ తిరిగి పొందడానికి బొట్టు సహాయపడుతుంది. అలాగే.. ఏకాగ్రతను మెరుగుపరుస్తుంది. అందుకే పూజల సమయంలో.. బొట్టు పెట్టుకుంటారు. బొట్టు నుదుటిపై పెట్టుకోవడం వల్ల.. ఏకాగ్రత మెరుగుపడుతుంది. అలాగే.. రక్త ప్రసరణ చురుగ్గా సాగుతుందని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు