Health

కరోనా ఆయింట్‌మెంట్ వచ్చేసింది

కరోనా ఆయింట్‌మెంట్ వచ్చేసింది

ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది లక్షల మందికి పైగా పొట్టనబెట్టుకున్న కరోనా సహా అనేక వైరస్‌లను సంహరించే తమ ఆయింట్‌మెంట్‌కు యూఎస్‌ఎఫ్‌డీయే ఆమోదం లభించిందని అమెరికాకు చెందిన ఓ ఫార్మా కంపెనీ తెలిపింది. దీనిని కొనుగోలు చేసేందుకు వైద్యుడు సిఫార్సు చేసిన మందులు చిట్టీ అవసరం లేదని పేర్కొంది. సొంతంగా ఎవరైనా వాడుకోవచ్చని వెల్లడించింది. ఆ ఆయింట్‌మెంట్‌ పేరు ఏపీటీ టీ3ఎక్స్‌ కావడం గమనార్హం.

‘టీ3ఎక్స్‌తో చికిత్స చేసిన 30 సెకన్ల తర్వాత ఎలాంటి వైరస్‌ కనిపించలేదని ప్రయోగశాల నివేదికల ద్వారా తెలిసింది’ అని అడ్వాన్స్‌డ్‌ పెనెట్రేషన్‌ టెక్నాలజీ సంస్థ స్థాపకుడు, సీఈవో డాక్టర్‌ బ్రియాన్‌ హ్యూబర్‌ తెలిపారు. ‘ముక్కు ద్వారా సంక్రమించే కరోనా వైరస్‌ నుంచి తప్పించుకునేందుకు ఇది కచ్చితంగా ఉపయోపగడుతుంది. ఇదో గొప్ప ఆవిష్కరణ. ఇలాంటి రక్షణ కోసమే చాలా మంది ఎదురుచూస్తున్నారు. కొవిడ్‌-19ను ఎదుర్కొనేందుకు ఇది ముందు వరుసలో నిలుస్తుంది. ఒక శక్తిమంతమైన రక్షణ పొరగా ఉపయోగపడుతుంది’ అని ఆయన తెలిపారు.

‘టీ3ఎక్స్‌కు ఎఫ్‌డీఏ ఆమోదం ఉంది. మందుల చిట్టీ లేకుండానే కొనుగోలు చేసుకోవచ్చు. దీనిని ఉపయోగించడం సులువు. అందుకు ఆరోగ్య సిబ్బంది సాయమూ అవసరం లేదు’ అని ఆ కంపెనీ తెలిపింది ఏపీటీ టీ3ఎక్స్‌ కరోనా వైరస్‌ (ఎన్‌ఎల్‌ 63), ఇన్‌ఫ్లూయెంజా వైరస్‌లపై అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తుందని లండన్‌కు చెందిన ఓ ప్రయోగశాల నివేదించింది! సెకన్లల వ్యవధిలోనే వైరస్‌ విస్తరించే శక్తిని నిర్వీర్యం చేస్తోందని తెలిపింది. ముక్కులోకి పీల్చుకోవడం ద్వారా వైరస్‌ సంక్రమణను దాదాపుగా అడ్డుకోవచ్చని పేర్కొంది. ప్రయోగశాలలో నిర్దేశిత వాతావరణంలో 99% వైరల్‌ లోడ్‌ తగ్గిందని వెల్లడించింది. బ్యాక్టీరియా, ఫంగస్‌ల నుంచి రక్షణ కోసమూ దీనిని ఉపయోగించుకోవచ్చు.