Movies

వ్యభిచార చిత్రంలో ఆలియా

వ్యభిచార చిత్రంలో ఆలియా

సంజయ్‌లీలా భన్సాలీ దర్శకత్వంలో నటించాలనేది ఆలియాభట్‌ చిన్ననాటి కోరిక. ఆ కోరిక ‘గంగూబాయ్‌ కతియావాడి’తో నెరవేర్చుకోబోతుంది ఆలియా. భన్సాలీ కూడా ఓ గొప్ప పాత్రలో ఆమెను చూపిస్తున్నారు. ఆ విషయం తాజాగా విడుదలైన ‘గంగూబాయ్‌ కతియావాడి’ పోస్టర్‌లో ఆలియా లుక్‌ను చూస్తే అర్థమవుతుంది. ఈమె ఆలియానేనా అని ఆశ్చర్యపోయేలా ఆమె లుక్‌ ఉంది. దానికి ఆలియా అభిమానులతో పాటు బాలీవుడ్‌ ప్రముఖుల నుంచీ ప్రశంసలు లభిస్తున్నాయి. ‘బలం..అధికారం..భయం..ఒక్క చూపు.. వేల భావోద్వేగాలు’ అంటూ ఆలియా లుక్‌ను ట్విటర్‌లో పంచుకుంది భన్సాలీ ప్రొడక్షన్స్‌. ముంబయిలోని కామాటిపుర ప్రాంతానికి చెందిన గంగూబాయ్‌ జీవితకథతో ఇది తెరకెక్కుతోంది. చిన్నతనంలోనే వ్యభిచార కూపంలోకి నెట్టబడిన ఆమె కాలక్రమంలో గంగూబాయ్‌గా మారి ‘మేడమ్‌ ఆఫ్‌ కామాటిపుర’గా మారింది. ఆమె జీవిత సంఘటనలతోనే ఈ చిత్రం తెరకెక్కుతోంది. సెప్టెంబరు 11న విడుదల కానుంది.