Fashion

అంతరిక్ష వాసనతో నాసా పెర్ఫ్యూం

అంతరిక్ష వాసనతో నాసా పెర్ఫ్యూం

అంతరిక్షాన్ని వాసన చూస్తారా? ఇదిగో ‘నాసా’ పెర్ఫ్యూమ్

➡️ అంతరిక్షం వాసన చూడాలని అనుకుంటున్నారా? అయితే, నాసా సాయంతో రూపొందించిన ఈ పెర్ఫ్యూమ్ గురించి తెలుసుకోవల్సిందే. ఇంతకీ ఇది ఎలాంటి వాసన వస్తుందో తెలుసా?

➡️పూల వాసన తెలుసు.. వంటల వాసన తెలుసు.. చివరికి మట్టి వాసన కూడా తెలుసు. ఇదేంటీ కొత్తగా? ‘అంతరిక్ష వాసన’ అనుకుంటున్నారా? అయితే, మీరు NASA రూపొందించిన ఈ సరికొత్త పెర్ఫ్యూమ్ గురించి తప్పకుండా తెలుసుకోవలసిందే. మనం ఇప్పటివరకు విమానమెక్కి గాల్లో మాత్రమే ఎగిరాం. అంతరిక్షానికి వెళ్లిన అనుభవం కేవలం వ్యోమగాములకు మాత్రమే ఉంది.ఆ సూన్య ప్రదేశంలో నెలలపాటు జీవించే వ్యోమగాములకు అక్కడ వింతైన వాసన వస్తుందని చెబుతుంటారు. ఈ నేపథ్యంలో ఒమెగా ఇంగ్రెడియంట్స్ కంపెనీ అధినేత, రసాయన శాస్త్రవేత్త స్టీవ్ పియర్స్‌ కు సరికొత్త ఆలోచన వచ్చింది. అంతరిక్షంలో వచ్చే వాసనతో పెర్ఫ్యూమ్ తయారు చేస్తే ఎలా ఉంటుందని భావించాడు. ఈ విషయాన్ని నాసా అధికారులకు చెప్పాడు.ఇదేదో ఆసక్తికరంగా ఉందని భావించిన నాసా ఆ పెర్ఫ్యూమ్ తయారీకి అనుమతి ఇచ్చింది. నాసా వ్యోమగాములు చెప్పిన వివరాలతో పియర్స్ ఆ పెర్ఫ్యూమ్‌ను తయారు చేశాడు. అంతరిక్షంలో వచ్చే వాసన తరహాలోనే పెర్ఫ్యూమ్ తయారు చేసి ఆశ్చర్యపరిచాడు. దానికి ‘ఈయూ డే స్పేస్’ (Eau De Space) అని పేరు పెట్టాడు. దీని సాయంతో వ్యోమగాములు అంతరిక్షంలోని ప్రమాదకర వాసనలను పసిగట్టవచ్చని పియర్స్ తెలిపాడు