Politics

నా ఓటు మన్మోహన్‌కే…

నా ఓటు మన్మోహన్‌కే…

ఏఐసీసీ అధ్యక్ష పదవికి సోనియాగాంధీ రాజీనామా చేశారు. ఇవాళ ఉదయం 11గంటలకు కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమావేశమైంది.ఈ సందర్భంగా సమావేశంలో తన రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అధ్యక్ష పదవి తనకు ఆసక్తి లేదని ఈ సందర్భంగా సోనియాగాంధీ తెలిపారు.మరో అధ్యక్షుడిని ఎన్నుకోవాలని సభ్యులకు సూచించారు. సోనియా రాజీనామాను సభ్యులకు కేసీ వేణుగోపాల్‌ చదివి వినిపించారు. ఈ సందర్భంగా అధ్యక్ష పదవికి సోనియా మాజీ ప్రధాని మన్మోహన్‌ పేరును ప్రతిపాదించారు.కాగా, మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఏకే అంటోని సోనియానే అధ్యక్షురాలిగా కొనసాగాలని కోరారు. 

కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి లేఖ రాసిన 23 మంది సీనియర్లపై సీడబ్ల్యూసీ సమావేశంలో రాహుల్ గాంధీ సీరియస్ అయిన సంగతి తెలిసిందే. వీరంతా బీజేపీతో కుమ్మక్కయ్యారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో కపిల్ సిబాల్, గులాం నబీ ఆజాద్ ట్విట్లర్ ద్వారా స్పందిస్తూ అసహనం వ్యక్తం చేశారు. మమ్మల్ని బీజేపీతో కుమ్మక్కయ్యామంటారా? అంటూ సిబాల్ ట్వీట్ చేశారు. రాజస్థాన్ హైకోర్టులో వాదించి ప్రభుత్వాన్ని నిలబెట్టింది ఎవరని ప్రశ్నించారు. మణిపూర్ లో బీజేపీని దించి కాంగ్రెస్ ను కాపాడింది ఎవరని అడిగారు. గత 30 ఏళ్ల కాలంలో బీజేపీకి అనుకూలంగా ఒక్క ప్రకటన అయినా చేయడం చూశారా? అని అసహనం వ్యక్తం చేశారు.దీని తర్వాత కపిల్ సిబాల్ యూటర్న్ తీసుకున్నారు. సీడబ్ల్యూసీ సమావేశంలో తాను అలాంటి వ్యాఖ్యలు చేయలేదని రాహుల్ తనకు వ్యక్తిగతంగా చెప్పారని… అందుకే తాను చేసిన ట్వీట్ ను ఉపసంహరించుకుంటున్నానని తెలిపారు.

కాంగ్రెస్‌లో ‘అధ్యక్ష’ వ్యవహారం ముదిరిపోయింది. సోమవారం కీలకమైన సీడబ్ల్యూసీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలోనే తదుపరి అధ్యక్షుడ్ని ఎంపిక చేసేస్తారన్న ప్రచారం ఊపందుకుంది. అయితే… తిరిగి అధ్యక్ష బాధ్యతలు చేపట్టే ప్రసక్తే లేదని సోనియా గాంధీ తెగేసి చెప్పినట్లు సమాచారం. రాహుల్, ప్రియాంక కూడా ఏమాత్రం సుముఖంగా లేరని సీనియర్లు చెబుతున్నారు. దీంతో గాంధీ కుటుంబేతర వ్యక్తులే ప్రస్తుతానికి అధ్యక్ష బాధ్యతలు చేపట్టే అవకాశాలున్నాయిఅయితే ఈ పదవికి బాగా ప్రచారంలోకి వచ్చిన పేరు జాతీయ ప్రధాన కార్యదర్శి, సోనియా గాంధీకి అత్యంత సన్నిహితులైన ముకుల్ వాస్నిక్. కానీ… ఆదివారం రాత్రి ఎంపీ రాహుల్ కొత్తగా రెండు పేర్లు సూచించినట్లు సమాచారం. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పేరు మొదటిది కాగా, రెండో పేరు కేంద్ర మాజీ మంత్రి, సీనియర్ నేత ఏకె. ఆంటోనీ. వీరిద్దరిలో ఎవరినో ఒకర్ని అధ్యక్ష బాధ్యతలకు ఒప్పించాలని సీనియర్లు రాహుల్ సూచించారు.రాహుల్ రాజీనామా చేసి, సోనియా గాంధీ తాత్కాలిక అధ్యక్ష బాధ్యతలు చేపట్టక మునుపు కూడా ఈ రెండు పేర్లే అధ్యక్ష బాధ్యతలకు బాగా ప్రచారంలోకి వచ్చాయి. వీరిని ఒప్పించడానికి రాహుల్ సన్నిహితులు, ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ రంగంలోకి దిగారు. సీనియర్లను వెంటబెట్టుకుని ఆంటోనీ ఇంటికి, మన్మోహన్ ఇంటికి కూడా వెళ్లారు. కానీ వారిద్దరూ ససేమిరా ఒప్పుకోలేదు.ఆ తర్వాత సోనియా బాధ్యతలు చేపట్టారు. మళ్లీ ఈ ఇద్దరి పేర్లనే రాహుల్ సూచించినట్లు సమాచారం. అయితే వీరిద్దరిలో ఎవర్ని నియమించినా… పూర్తి కాలపు అధ్యక్షులుగా నియమించరని సమాచారం. కేవలం తాత్కాలిక అధ్యక్ష బాధ్యతలే అప్పజెప్పనున్నారు. కోవిడ్ సమస్య సమసిపోయిన తర్వాత… కాంగ్రెస్ ప్లీనరి నిర్వహిస్తారని సమాచారం. ఈ సమావేశంలోనే పూర్తి కాలపు అధ్యక్షునిగా రాహుల్ బాధ్యతలు చేపట్టనున్నారు.