Food

సగ్గుబియ్యం షెర్భత్ తాగితే…

సగ్గుబియ్యం షెర్భత్ తాగితే…

*** కావాల్సినవి:
సగ్గుబియ్యం- అరకప్పు, కొబ్బరి తురుము- అరకప్పు, పంచదార- కప్పు, పాలు- లీటరు, చెనా(పాలవిరుగుడు)- కప్పు, చిన్నముక్కలుగా కోసిన యాపిల్‌- ఒకటి, కిస్‌మిస్‌- స్పూన్‌, ద్రాక్షపండ్లు- పది, అరటిపండ్లు- రెండు, మిరియాలపొడి- అర టీస్పూన్‌, దానిమ్మ గింజలు- రెండు టేబుల్‌స్పూన్లు.

*** తయారీ విధానం:
సగ్గుబియ్యాన్ని కడిగి రెండు గంటలపాటు నానబెట్టాలి. సగ్గుబియ్యం, కొబ్బరి తురుములో కొద్దిగా పాలు పోసి గ్రైండ్‌ చేసుకోవాలి. అరటిపండ్లను గిన్నెలో వేసి మెదపాలి. దీంట్లో పంచదార, పాలు, చెనా వేసి కలపాలి. తర్వాత మిరియాల పొడి, సగ్గుబియ్యం మిశ్రమం, కిస్‌మిస్‌ వేసి మరోసారి బాగా కలిపితే సరి. చివరగా ద్రాక్షపండ్లు, దానిమ్మ గింజలు వేసుకుంటే రుచిగా ఉంటుంది. దీన్ని కాసేపు ఫ్రిజ్‌లో పెడితే చలచల్లని షర్బత్‌ తయారైనట్లే.