DailyDose

ఒకేరోజు 61వేల కేసులు-TNI బులెటిన్

ఒకేరోజు 61వేల కేసులు-TNI బులెటిన్

* 9927 new cases in AP today.

* తిరువూరు ప్రభుత్వ ఆసుపత్రిలో నేడు పట్టణానికి చెందిన 110 మందికి Caronaపరీక్షల నిమిత్తం శాంపిల్స్ సేకరించారు ప్రతిరోజు రాపిడి టెస్టులు ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహిస్తూ ఉండగా ఈరోజు సేకరించిన శాంపిల్స్ మాత్రం విజయవాడ కు పంపించారు ఫలితాలు రావడానికి నాలుగు రోజులు సమయం పట్టవచ్చునని ఆసుపత్రి వర్గాలు అంటున్నాయి రాపిడ్ టెస్ట్లో నిమిషాల వ్యవధిలోనే ఫలితాలు వెల్లడి అవుతాయి అటువంటిది తిరువూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్షలు నిర్వహించకుండా విజయవాడ కి శాంపిల్స్ పంపించటం పట్ల పరీక్షలు చేయించుకున్న వారిలో ఆందోళన వ్యక్తమవుతోంది రేపటి నుండి అయినా తిరువూరు ప్రభుత్వ ఆసుపత్రిలోనే రాపిడ్ టెస్ట్ను నిర్వహించి ఫలితాలను వెంటనే ప్రకటించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు

* కోవిడ్ ఆస్పత్రికి భారీ విరాళం ఇచ్చిన బాలకృష్ణ ..- హిందూపురం ప్రజల ఆరోగ్య రక్షణ కోసం బాలయ్య ఔదార్యం★ హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు, శ్రీ నందమూరి బాలకృష్ణ కరోనా కష్టకాలంలో ప్రజల కోసం నేను సైతం అంటూ తన గొప్ప మనస్సును చాటుకుంటున్నారు.★ హిందూపురం ఎమ్మెల్యేగా ప్రజలకు చేరువగా ఉండేందుకు ప్రయత్నిస్తున్న బాలకృష్ణ తన నియోజకవర్గంలోని గవర్నమెంట్ కోవిడ్ ఆసుపత్రిలో ఏర్పాటైన కొవిడ్ కేర్ సెంటర్ కు 55 లక్షల రూపాయల భారీ విరాళం ఇచ్చి తన గొప్ప మనసును చాటుకున్నాడు.★ గతంలో హిందూపురం ప్రభుత్వాసుపత్రికి వెంటిలేటర్లను డొనేట్ చేశారు బాలకృష్ణ. ఇప్పుడు కోవిడ్ ఆస్పత్రికి ఏకంగా భారీ విరాళమే ఇచ్చారు.★ కరోనా కష్ట కాలంలో హిందూపురం ప్రజల కోసం బాలయ్య గొప్ప మనసు.★ ఏపీలో కరోనా కేసులు తీవ్రంగా పెరుగుతున్నాయి.★ ఆంధ్రప్రదేశ్లో అత్యంత ఎక్కువగా కరోనా ప్రభావం ఉన్న జిల్లాలలో అనంతపురం జిల్లా ఒకటి.★ అనంతపురం జిల్లాలోని హిందూపురంలోనూ కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి.★ కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ కోసం ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నా, కరోనా వ్యాప్తి మాత్రం తగ్గడం లేదు.★ దీంతో ప్రతిపక్ష పార్టీలు కరోనా నియంత్రణలో అధికార పార్టీ విఫలమైందని ఆరోపణలు గుప్పిస్తున్నాయి.★ ఇదే సమయంలో టిడిపి ఎమ్మెల్యే అయిన బాలకృష్ణ కరోనా వైరస్ నియంత్రణకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు తోడు నియోజకవర్గ ప్రజల సంక్షేమం కోసం తన వంతు సహాయం చేశారు.★ కరోనా వారియర్స్ కు కావాల్సిన మౌలిక వసతుల కల్పనకు బాలయ్య భారీ విరాళం★ హిందూపురం నియోజకవర్గ ప్రజలకు తానున్నానని భరోసా ఇచ్చారు బాలయ్య.★ కరోనా వైరస్ నివారణకు కావలసిన మందులను, పిపిఈ కిట్లను, మాస్కులు, ఇతర పరికరాలను అందించడానికి ఆయన భారీ విరాళం ఇచ్చారు.★ తన నియోజకవర్గంలో ఉన్న పరిస్థితులను పర్యవేక్షిస్తూ, ప్రజల ఆరోగ్య రక్షణ కోసం ఎప్పటికప్పుడు వైద్యులకు తగిన సూచనలు చేస్తున్నారు బాలకృష్ణ.★ కోవిడ్ పేషెంట్ల విషయంలో వారికి కావలసిన సదుపాయాలను కల్పించడానికి బాలయ్య తన వంతు సహాయం చేస్తూనే ఉన్నారు.★ తాజాగా కరోనా క్లిష్టసమయంలో బాలయ్య నియోజకవర్గ ప్రజలకు అండగా ఉంటున్నానని తాను చేసిన సహాయం ద్వారా, ఇచ్చిన భారీ విరాళం ద్వారా స్పష్టం చేశారు.

* 24 గంటల లో 60,975 కరోనా కేసులు. దేశంలో కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగూతూనే ఉంది.గడిచిన గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 60,975 కరోనా కేసులు నమోదయ్యాయి.దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 31,67,324కు పెరిగింది.ఈ మేరకు మంగళవారం ఉదయం కేంద్ర వైద్యారోగ్యశాఖ హెల్త్‌బులెటిన్‌ విడుదల చేసింది.కరోనాతో కొత్తగా 848 మంది మరణించగా.. మొత్తం మరణాల సంఖ్య 58,390కి చేరుకుంది.దేశవ్యాప్తంగా కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న వారి సంఖ్య 24, 04, 585గా ఉంది.దేశంలో ప్రస్తుతం 7,04,348 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.ఇప్పటివరకు 3.5 కోట్ల మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు.