Devotional

మామగారు అల్లుడి కాళ్లు కడగడం వెనుక కథ ఏమిటి?

మామగారు అల్లుడి కాళ్లు కడగడం వెనుక కథ ఏమిటి?

వివాహంలో కన్యాదానం ప్రదాన తంతు. పెళ్లిలో వరుడి కాళ్లు వధువు తండ్రి కడగడం సంప్రదాయంగా వస్తోంది. ఇలా పెళ్లికొడుకు కాళ్లు కడగడానికి ఓ కారణ ముంది. అసలీ తంతు ఎలా జరుపుతారంటే… ముందు గా కళ్యాణ వేదికపై వరుణ్ణి పడమటి ముఖంగా కూర్చో బెడతారు. కన్యాదాత తూర్పుముఖంగా కూర్చుం టాడు. వరుణ్ణి శ్రీమహావిష్ణు స్వరూపునిగా భావించి కన్యాదాత పూజించి సత్కరిస్తాడు. నీటిని అభిమంత్రించి మొదట కుడికాలు, తరు వాత ఎడమ కాలును మామ కడుగుతాడు. “కుడికాలుని మహేంద్రుని అంశగానూ, ఎడమ పాదాన్ని ఇంద్రుని అంశగా భావి స్తు న్నాను. నీ పాదాలను రక్షించే దేవతలను పూజిం చిన ఈ జలం నా శత్రువులను కాల్చివేస్తుంది’ అని మామ చెప్పినట్లుగా ఉండే మంత్రాలను పురోహితులు చదువుతారు. కాళ్లు కడిగిన నీళ్లను కన్యాదాత దంపతులు కొద్దిగా శిరస్సుపై చల్లుకోవడం ఆచారం. అర్ఘమిచ్చి, ఆచమనం చేయించిన తరువాత మధుపర్కం అందిస్తారు.