Movies

విద్యార్థులకు సోనూ ఫోన్లు

విద్యార్థులకు సోనూ ఫోన్లు

కోవిడ్‌-19 కార‌ణంగా ఆన్ లైన్ త‌ర‌గ‌తులు చాలా ముఖ్య‌మైన నేప‌థ్యంలో ఏజెన్స్ ప్రాంతాల్లోని పిల్ల‌ల‌కు స్మార్ట్ ఫోన్లు అందుబాటులో లేని ప‌రిస్థితి ఉన్న విషయం తెలిసిందే. ఆన్ లైన్ త‌ర‌గ‌తుల కోసం కొన్నిమైళ్ల దూరం ప్ర‌యాణిస్తున్న హ‌ర్యానాలోని ఏజెన్సీ ప్రాంతం మోర్ని వాసుల పిల్ల‌ల‌కు బాలీవుడ్ న‌టుడు సోనూసూద్ అండ‌గా నిలిచి..మ‌రోసారి త‌న గొప్ప మ‌న‌సును చాటుకున్నాడు. మోర్నిలో కోటి గ్రామంలోని ప్ర‌భుత్వ సీనియ‌ర్ సెకండ‌రీ స్కూల్ విద్యార్థుల‌కు సోనూసూద్ త‌న స్నేహితుడి క‌ర‌ణ్ గిల్హోత్రా ద్వారా స్మార్ట్ ఫోన్లు అందించాడు. స్కూల్ ప్రిన్సిపాల్ కు స్మార్ట్ ఫోన్ల‌ను అంద‌జేశాడు. స్మార్ట్ ఫోన్లతో వీడియో కాల్ విద్యార్థులు సోనూసూద్ తో మాట్లాడ‌టం విశేషం. నా రోజు అద్బుతంగా ప్రారంభ‌మైంది. విద్యార్థులంద‌రూ స్మార్ట్ ఫోన్లు అందుకుని ఆన్ లైన్ త‌ర‌గ‌తుల‌కు హాజ‌ర‌వుతున్నార‌ని ట్వీట్ చేశాడు సోనూసూద్‌.