WorldWonders

ఈ హోటల్ పెద్దలకు మాత్రమే

ఈ హోటల్ పెద్దలకు మాత్రమే

పెద్దలకు మాత్రమే.. అనేది మనకు తెలిసినంత వరకు సినిమాలకు సంబంధించి సెన్సార్ బోర్డ్ హెచ్చరిక. అయితే, ఇఫ్పుడు కొన్ని హోటల్స్ కూడా ‘పెద్దలకు మాత్రమే’ అని వెలుస్తున్నాయి. పిల్లలతో వచ్చే వారిని అనుమతించరు. పూర్తిగా ఈ హోటల్ పెద్దలకు మాత్రమే. ప్రపంచవ్యాప్తంగా ఈ కాన్సెప్ట్ వేగంగా విస్తరిస్తున్నది. ప్రస్తుతం దేశంలో ఇలాంటి హోటల్ ఒక్క గోవాలోనే ఉన్నది. ‘పెద్దలకు మాత్రమే’ ట్యాగ్ లైన్ తో కారణంగా కొత్తగా పెళ్ళైన వారు హానీమూన్ ట్రిప్స్ కు వచ్చేవారిని, ఏకాంతం కోరుకునేవారిని ఆకట్టుకోవచ్చనేది పార్క్ హోటల్ నిర్వాహకుల ప్రణాళిక. విమానాశ్రయం నుంచి గంట సేపు ప్రయాణించి బాగా బీచ్ కు చేరుకోవచ్చు. అక్కడి నుంచి మరో 10 నిమిషాలు దూరంలో ఈ హోటల్ ఉన్నది. ఇందులో 28 పడక గదులు ఉన్నాయి. ప్రత్యేక భోజనాలు, స్పా చికిత్సలు, శృంగార బహుమతులు, మేక్-యువర్-కాక్టెయిల్ సెట్‌లు, వైన్లు, కొవ్వొత్తులు, చాక్లెట్లు, పువ్వులు… ఎన్నో మనల్ని మరో లోకానికి తీసుకెళ్తాయట.ఉచిత వైఫై ,కాంప్లిమెంటరీ బ్రేక్ ఫాస్ట్ అనేవి ఎంత కీలకంగా మారాయో.. ‘పెద్దలకు మాత్రమే’ అనేది కూడా అంతే కామన్ గా మారిందంట. అందుకే ఏకాంతం కోరుకునే వారి కోసం ప్రత్యేక హోటల్ ను సిద్ధం చేయాలన్న ఆలోచన నుంచి ఆ హోటల్ పుట్టిందంట. విదేశాల్లో ఈ కాన్సెప్ట్ చాలా వేగంగా వృద్ధి చెందుతున్నది. ఈ హోటల్ ఏకంగా 85 శాతం ఆక్యుపెన్సీతో నడుస్తున్నదంటే.. ఎంత మంది ప్రైవసీ కోరుకుంటున్నారో అర్థమవుతుంది.