DailyDose

పింఛన్లు ఇచ్చే వ్యక్తి నుండి 54మందికి కోవిద్-TNI బులెటిన్

పింఛన్లు ఇచ్చే వ్యక్తి నుండి 54మందికి కోవిద్-TNI బులెటిన్

* పింఛన్లు అందజేసిన వ్యక్తి ద్వారా గ్రామంలో 54 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయిన ఘటన వనపర్తి జిల్లాలో చోటుచేసుకుంది. చిన్నంబావి మండలం పెద్దదగడలో పింఛన్లు అందజేసే ఓ వ్యక్తి నుంచి కరోనా వ్యాప్తి జరిగినట్లు గ్రామస్థులు తెలిపారు. ఐదు రోజుల క్రితం గ్రామంలోని ఓ ఇంటి వద్ద కరోనా సోకిన వ్యక్తి పింఛన్లు పంపిణీ చేశాడు. ఆ వ్యక్తి కుటుంబసభ్యుల్లో ఒకరు నాలుగురోజుల క్రితం అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబసభ్యులందరికీ కరోనా పరీక్షలు నిర్వహించారు. ఆ పరీక్షల్లో కుటుంబంలోని 9 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ కావడంతో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. సోమవారం గ్రామంలోని 250 మందికి ర్యాపిడ్‌, యాంటిజెన్‌ కిట్ల ద్వారా పరీక్షలు నిర్వహించగా 54 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ చేశారు. పాజిటివ్‌ వచ్చిన వారందరినీ హోం క్వారంటైన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు.

* కరోనా నేపథ్యంలో పోలీసువారు ఎంత చెప్పినప్పటికి కోవిడ్ నిబంధనలు ఉల్లంఘిస్తూ వినాయక పూజ సంజీవ్ నగర్ లో నిర్వహించారు. పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిది అన్నపూర్ణవీది కి చెందిన దాసరి రాంబాబు కుటుంబంపై పలాస – కంచరవీధి కి చెందిన హిరంబో, వాళ్ల కుమారుడు, వాళ్ళ వర్గం మరియు రఘు సాహు,(సుమారు 20 మంది సభ్యులు) ఒక్కసారిగా దాడికి పాల్పడ్డారు.

* ఒక్కరోజే 1059 మంది మృత్యువాత! 24గంటల్లో 67వేల కొత్త కేసులు, 63వేల మంది రికవరీదేశంలో 59వేలు దాటిన కరోనా మరణాలుదిల్లీ: భారత్‌లో కరోనా వైరస్ మహమ్మారి విలయతాండవం కొనసాగుతూనే ఉంది. గడిచిన కొన్ని రోజులుగా మరణాల సంఖ్య తగ్గినప్పటికీ నిన్న మళ్లీ ఈ సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. గడిచిన 24గంటల్లో 1059 మంది కొవిడ్‌ రోగులు మృత్యువాతపడ్డారు. ఈ స్థాయిలో మరణాలు సంభవించడం ఇది రెండోసారి. ఆగస్టు 19న అత్యధికంగా 1092 మరణాలు నమోదయ్యాయి. బుధవారం నాటికి దేశంలో కరోనా మరణాల సంఖ్య 59,449కు చేరినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ వెల్లడించింది. దేశవ్యాప్తంగా నిన్న మరో 67,151 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో కరోనా కేసుల సంఖ్య 32,34,474కు చేరింది. వీరిలో ఇప్పటివరకు 24లక్షల మంది కోలుకోగా మరో 7లక్షల క్రియాశీల కేసులు ఉన్నాయి.

* విజయనగరం జిల్లా:మిమ్స్ కోవిడ్ ఆసుపత్రిలో మార్చురీ సిబ్బంది చేతివాటం. కరోనాతో చనిపోయిన మహిళ వద్ద బంగారం మాయంమృతదేహం వద్ద బంగారం కాజేసిన సిబ్బందిఐదు తులాలు విలువజేసే బంగారు గొలుసు, ఉంగరాలు మాయంమృతదేహాన్ని చూపించకుండా తరలించేందుకు ప్రయత్నంస్మశానంలో మృతదేహాన్ని విప్పగా బయటపడిన అసలు విషయంవీరఘట్టం మండలం ఏమ్ రాజపురం గ్రామంకు చెందిన సరస్వతీ అనే మహిళ వస్తువులు అపహరణ.

* ఇక నుంచి ఏపీలో కోవిడ్ టెస్టులు చేయించుకున్నవారు వారికి ఇచ్చిన శాంపిల్స్ నెంబర్ లేదా అధార్ కార్డు నెంబర్ లేదా ఫోన్ నెంబర్ ఉపయోగించి ఈ క్రింద లింక్‌ను క్లిక్ చేసి http://dashboard.covid19.ap.gov.in/ims/knowSampleStatus/ టెస్టు రిజల్ట్స్‌ను తెలుసుకోవచ్చు.

* తిరుపతి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌ రెడ్డి కరోనా బారినపడ్డారు. చికిత్స నిమిత్తం ఆయన రుయా ఆస్పత్రిలో చేరారు. ఇక భూమన కుమారుడు అభినయ రెడ్డి కూడా ఇప్పటికే కరోనాతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. కాగా కరోనా బాధితుల మృతదేహాల అంత్యక్రియలపై అపోహలు తొలగించేందుకు ఎమ్మెల్యే, కోవిడ్‌ సమన్వయ కమిటీ చైర్మన్‌ భూమన కొద్దిరోజుల క్రితం స్వయంగా రంగంలోకి దిగారు. కరకంబాడి రోడ్డు లోని గోవింద దామంలో కరోనా వైరస్ మృతదేహాలను ఖననంపై అపోహలు తొలగించేందుకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కరోనాతో చనిపోయినవారి మృత దేహాలకు ఆయన దహన సంస్కారాలు చేశారు.

* ప్రవేట్ కోవిడ్ కేర్ సెంటర్లపై ఏపీ ప్రభుత్వం కొరడా.విజయవాడలో ఐదు కోవిడ్ కేర్ సెంటర్లు అనుమతి రద్దునిబంధనలకు విరుద్ధంగా, అధిక ఫీజులు వసూళ్లు చేస్తున్న సెంటర్లుపై వేటురమేష్ హాస్పిటల్స్ వారి స్వర్ణ హైట్స్డా లక్ష్మీ నర్సింగ్ హోమ్ వారి ఎనికేపాడులో హోటల్ అక్షయఇండో బ్రిటిష్ హాస్పిటల్ వారి బెంజ్ సర్కిల్ లో హోటల్ ఐరా…NRI హీలింగ్ హాండ్స్ మరియు ఆంధ్రా హాస్పటల్స్ వారి సన్ సిటీ, కృష్ణ మార్గ్రోగుల నుంచి అందిన ఫిర్యాదుల నేపథ్యంలో విచారణ.