DailyDose

ఏపీలో కరోనా పరీక్ష ధరలు తగ్గాయి-TNI బులెటిన్

ఏపీలో కరోనా పరీక్ష ధరలు తగ్గాయి-TNI బులెటిన్

* ప్రైవేట్ ల్యాబ్స్ లో కరోనా టెస్ట్ ధరలను కుదిస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ప్రభుత్వం పంపిన శాంపిల్స్ టెస్ట్ కు 2400 రూపాయలు ఉన్న ధరను 1600 రూపాయలకు కుదిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ప్రైవేట్‌గా ల్యాబ్స్ లో టెస్ట్ కోసం గతంలో నిర్దేశించిన 2900 రూపాయల ధరను 1900 కుదిస్తూ ఏపీ వైద్య ఆరోగ్యశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. టెస్ట్ కిట్లు పెద్ద ఎత్తున అందుబాటులోకి రావటంతో కిట్లు ధర తగ్గిందని ప్రభుత్వం వెల్లడించింది. తగ్గిన ధరల ద్వారా వచ్చే ప్రయోజనాలను ప్రజలకు అందించడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఏపీ సర్కార్‌ ఉత్తర్వుల్లో వెల్లడించింది.

* ఆగిన కరోనా పరీక్షలు. tiruvUru స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో గురువారం నాడు కరోనా నిర్ధారణ పరీక్షలు నిలిపివేశారు. పరీక్షలకు అవసరమైన kitlu లేకపోవడంతో ఈ పరీక్షలు ఆగిపోయాయి. శుక్రవారం నాడైనా kits తెప్పించి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.

* ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఏపీలో 3.82 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. ఏపీలోని ఉభయ గోదావరి జిల్లాల్లో కేసులు భారీగా నమోదవుతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో ఇప్పటి వరకు 30వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. కరోనా మహమ్మారి జీవితాలను తారుమారు చేస్తున్నది. ఈ మహమ్మారి దెబ్బకు ప్రజలు విలవిలలాడిపోతున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో ఇటీవల ఓ హృదయవిదారకమైన సంఘటన జరిగింది.

* కోవిడ్ -19 వైరస్ ని అన్ని విధాలా ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం… తాజాగా మరో వినూత్న నిర్ణయం తీసుకుంది. కరోనా కారణంగా వివిధ రాష్ట్రాల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా ఏపీకి వచ్చిన సాఫ్ట్ వేర్ ‘టెక్కీ’లు, ఉద్యోగుల కోసం బ్రాడ్ బ్యాండ్ సేవలు విస్తరించాలని రాష్ట్ర ఐటి శాఖామంత్రి మేకపాటి గౌతం రెడ్డి నిర్ణయించారు.