DailyDose

బాలికపై నలుగురు రేప్-నేరవార్తలు

బాలికపై నలుగురు రేప్-నేరవార్తలు

* సంచలన రేప్ కేస్ పై సిసిఎస్ దర్యాప్తు వేగం139 మంది తొమ్మిదేళ్లుగా అత్యాచారం చేశారని యువతి ఫిర్యాదు. పంజా గుట్ట పోలీసులను ఆశ్రయించిన బాధితురాలుకేసును పంజాగుట్ట పిఎస్ నుంచి సిసిఎస్ కు బదిలీ139 మంది నింధితులకు నోటీసులు జారీ చేయనున్న సిసిఎస్ పోలీసులు.

* అనంతపురం జిల్లా రాయదుర్గం నేషనల్ హైవేపై స్థానికులకు భారీగా డబ్బు దొరికింది. రూ.10 లక్షల మేర రూ.500 నోట్లు దొరికినట్లు స్థానికుల సమాచారం. వడ్రవన్నూరు శివారులో గుర్తుతెలియని వ్యక్తులు పడేసి వెళ్లినట్లు తెలుస్తోంది. బొమ్మకపల్లి, 74 ఉడేగోళం గ్రామస్తులు నోట్లు తీసుకున్నారని చెబుతున్నారు. ఈ ఘటనపై రాయదుర్గం పోలీసులు, డబ్బు ఎవరు పడేశారు, ఎందుకు పడేసి ఉంటారనే కోణాల్లో ఆరా తీస్తున్నారు.

* ఫేస్‌బుక్‌ ద్వారా ఓ వ్యక్తితో ఏర్పడిన పరిచయం ఓ మహిళను మోసపోయేలా చేసింది. పోలీసుల కథనం ప్రకారం.. కానూరు మురళీనగర్‌కు చెందిన ఓ మహిళ స్థానికంగా కిరాణా కొట్టు నడుపుతోంది. ఈమె ఫేస్‌బుక్‌ ఖాతాకు ఇటీవల ఓ వ్యక్తి హాయ్‌.. అంటూ మెసేజ్‌ పంపాడు. దీనికి ఈమె కూడా స్పందించి హాయ్‌.. అంటూ తిరిగి మెసేజ్‌ పంపింది.అప్పట్నించి వీరిద్దరి నడుమ పరిచయం ఏర్పడగా తాను లండన్‌లో వైద్యుడిగా పనిచేస్తానంటూ అతను నమ్మించాడు. కొద్దిరోజుల క్రితం ఇతను లండన్‌ నుంచి ఖరీదైన కానుకలను పంపుతున్నానంటూ ఫోన్‌లో తెలిపాడు. ఈనెల 2న కానుకల పార్శిల్‌ దిల్లీ ఎయిర్‌పోర్టులో ఉందని కస్టమ్స్‌ అధికారులకు రూ.1.30 లక్షల నగదు చెల్లించాల్సి ఉందని ఇతను వివరించాడు. తాను పంపే బ్యాంకు ఖాతాల్లో ఆ నగదు పంపాలని తెలిపాడు. దీంతో ఈమె ఆ మొత్తాన్ని అతను చెప్పిన ఖాతాల్లో విడతల వారీగా రూ.1.30 లక్షలు జమచేసింది. రెండ్రోజుల తర్వాత నుంచి ఇతని నెంబరుకు ఫోన్‌ చేస్తే పలకడం లేదు. కానుకల పార్శిల్‌ తనకు చేరకపోవడంతో మోసపోయినట్లు గుర్తించిన బాధితురాలు బుధవారం పెనమలూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

* వారిది ప్రేమ వివాహం.. భిక్షాటన చేస్తూ.. చిత్తు కాగితాలు అమ్మగా వచ్చే డబ్బుతో జీవించేవారు. మద్యం మహమ్మారి వారి మధ్య చిచ్చు పెట్టింది. తాగేందుకు డబ్బులివ్వలేదని 8 నెలల గర్భిణి అయిన భార్యను భర్త కత్తితో పొడిచి హత్య చేశాడు. చిలకలగూడ ఠాణా పోలీసుల కథనం ప్రకారం.. తుకారాంగేట్‌కు చెందిన గౌతమ్‌ కుమార్‌(24), లాలాగూడకు చెందిన మహాలక్ష్మి(20)లది ప్రేమ వివాహం. ఏడాది బాబు ఉన్నాడు. ప్రస్తుతం ఆమె 8 నెలల గర్భిణి. గాంధీ ఆసుపత్రి ఎదురుగా కాలిబాటపై ఉంటున్నారు. గౌతమ్‌ మద్యానికి బానిసయ్యాడు. తాగి వచ్చి గొడవపడేవాడు. మద్యానికి డబ్బులివ్వమని మంగళవారం రాత్రి భార్యను అడిగాడు. నిరాకరించటంతో గొడవ పడి బయటకు వెళ్లాడు. అర్ధరాత్రి మద్యం తాగొచ్చి నిద్రపోతున్న భార్యను కత్తితో కర్కశంగా పొడిచి చంపాడు. స్థానికులు సమాచారం మేరకు పోలీసులు వచ్చి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేశారు.

* నగ్న చిత్రాలతో బ్లాక్‌మెయిల్.. బాలికపై నలుగురి గ్యాంగ్ రేప్.హైదరాబాద్ నగరం లో దారుణంబాలికను ప్రేమ పేరుతో వలలో వేసుకుని నగ్న చిత్రాలు సేకరించిన శివకుమార్ వాటిని అడ్డం పెట్టుకుని తన స్నేహితులతో కలిసి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు.ప్రేమ పేరుతో మైనర్ బాలికను నమ్మించి ఓ యువకుడు తన ముగ్గురు స్నేహితుల సాయంతో ఆమెపై సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డాడు.చిలకలగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు.మహ్మద్‌గూడకు చెందిన బాలిక(14)కు సీతాఫల్‌మండి బీదల బస్తీకి చెందిన శివకుమార్‌ (23)తో కొంతకాలంగా ప్రేమాయణం కొనసాగుతోంది.బాలికను అనేకసార్లు బయటికి తీసుకెళ్లిన శివకుమార్ ఆమె నగ్నచిత్రాలను తన సెల్‌ఫోన్లో చిత్రీకరించాడు. వాటిని అడ్డం పెట్టుకుని ఏడాదిగా ఆమెను వేధిస్తున్నాడు.వారం రోజుల క్రితం శివకుమార్‌తో పాటు అతడి ముగ్గురు స్నేహితులు బాలిక బెదిరించారు.తాము చెప్పిన చోటికి వస్తే నగ్న చిత్రాలను డిలీట్ చేసేస్తామని నమ్మించారు.ఆ మాటలు నమ్మిన బాలిక వారి వెంట ఓయూ పరిధిలోని ఓ పాత భవనానికి వెళ్లింది.అక్కడ నలుగురు కామాంధులు ఆమెను బెదిరించి సామూహిక అత్యాచారానికి పాల్పడటంతో పాటు ఆ దారుణాన్ని వీడియో తీశారు. ఈ విషయం ఎవరికైనా చెబితే వీడియోలు సోషల్‌మీడియాలో పోస్ట్ చేస్తామని బెదిరించారు. తర్వాతి రోజు బాలిక అనారోగ్యానికి గురికావడంతో ఏం జరిగిందని కుటుంబసభ్యులు అడగ్గా జరిగిన విషయాన్ని చెప్పింది. దీంతో వారు రెండ్రోజుల క్రితం చిలకలగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు.కేసు నమోదు చేసుకున్న పోలీసులు బుధవారం నలుగురిని అరెస్ట్ చేశారు.నిందితుల్లో ముగ్గురు మైనర్లు కావడంతో జువైనల్ హోమ్‌కి తరలించారు.