Fashion

ఇక మీ ఫేస్‌ప్యాక్‌లపై మోడీ ప్రభుత్వ నిఘా

ఇక మీ ఫేస్‌ప్యాక్‌లపై మోడీ ప్రభుత్వ నిఘా

సురక్షితమైన సౌందర్య సాధన ఉత్పత్తుల (కాస్మొటిక్స్‌) కోసం.. పర్యవేక్షణకు ప్రత్యేక ‘నిఘా’ ఏర్పాటుకు కేంద్రం యోచిస్తోంది. ‘కాస్మెటో-విజిలెన్స్‌’ పేరిట ఈ విధానాన్ని ప్రవేశపెట్టేందుకు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రణాళిక రూపొందిస్తోంది. ఆయా ఉత్పత్తుల వల్ల ఏవైనా దుష్ప్రభావాలుంటే దీనిద్వారా వెంటనే గుర్తించి హెచ్చరిస్తారు. వాటి విక్రయాలపై కూడా నిఘా ఉంచుతారు. ప్రస్తుతం మందులు, కాస్మెటిక్స్‌ రెండూ కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ (సీడీఎస్‌సీఓ), భారత ఔషధ నియంత్రణ ప్రాధికార సంస్థల పరిధిలో ఉన్నాయి. అయితే కాస్మొటిక్స్‌ కార్యకలాపాలకు సంబంధించి ప్రత్యేకంగా ఏ వేదికా లేదు. ఇటీవల సురక్షిత ప్రమాణాలేవీ మదింపు చేయకుండా విక్రయిస్తున్న కొన్ని కాస్మొటిక్‌ కేసులను సీడీఎస్‌ఓ గుర్తించింది. ఈ నేపథ్యంలోనే ‘కాస్మొటో-విజిలెన్స్‌’ ఏర్పాటు అవసరమైనట్లు సంబంధిత అధికార వర్గాలు తెలిపాయి.