Movies

రైతుల కోసం…

రైతుల కోసం…

శ్రుతీ హాసన్‌ కథానాయిక మాత్రమే కాదు! నటనకే ఆమె పరిమితం కాలేదు!! తండ్రి కమల్‌ హాసన్‌లా శ్రుతి సైతం బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆమెలో ఓ సంగీత దర్శకురాలు, గాయని ఉన్నారు. అలాగే మంచి స్టేజి ఆర్టిస్ట్‌ కూడా. ఇటీవల ‘ఎడ్జ్‌’ అని ఓ పాట విడుదల చేశారు. యాదృచ్ఛికమో… మరొకటో… తమిళ చిత్రం ‘లాభం’లో ఆమె మ్యూజిషియన్‌గా నటించారు. ఓ విధంగా నిజ జీవిత పాత్రను తెరపై పోషిస్తున్నారన్నమాట. తెరపై విజయ్‌ సేతుపతికి జంటగా క్లారా పాత్రలో కనిపించనున్నారు. సినిమాలో ఒక పాటను స్టేజి మీద ఆమె పెర్‌ఫార్మ్‌ చేస్తున్నట్టు ప్లాన్‌ చేశారు. వ్యవసాయదారులను కార్పొరేట్‌ కంపెనీలు ఏ విధంగా దోచుకుంటున్నాయనే కథాంశంతో రైతుల కష్టాలను ప్రస్తావిస్తూ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. రైతుల పక్షాన పోరాటం చేసే కథానాయకుడితో సంగీత కళాకారిణి ఎలా ప్రేమలో పడింది? అతడికి ఎటువంటి సహాయం చేసింది? అనేది ఆసక్తికరమట. తెలుగులో రవితేజ సరసన ‘క్రాక్‌’లో ఆమె నటిస్తున్నారు.