DailyDose

ఖమ్మంలో లిఫ్ట్ బటన్ ద్వారా 20మందికి కరోనా-TNI బులెటిన్

ఖమ్మంలో లిఫ్ట్ బటన్ ద్వారా 20మందికి కరోనా-TNI బులెటిన్

* ఖమ్మంలో లిఫ్ట్‌ బటన్‌ ద్వారా 20 మందికి కరోనా సోకింది. ఖమ్మం బైపాస్‌ రోడ్డులో గల ఓ అపార్ట్‌మెంట్‌లో 2 వారాల్లో 20 మందికి కరోనా సోకడంతో కలకలం రేగింది. వారిలో ఓ వ్యక్తి హైదరాబాద్‌లో చికిత్సపొందుతూ చనిపోయాడు. అయితే, గ్రౌండ్‌ ఫ్లోర్‌ లో ఏ ఒక్కరికీ కరోనా సోకలేదు. దీంతో లిఫ్ట్‌ బటన్‌ వల్లే కరోనా వ్యాపించినట్టు నిర్ధారించారు అధికారులు.

* 2932 new cases in telangana today

* భారత్‌లో కరోనా విజృంభణ రోజురోజుకీ కొత్త రికార్డులు సృష్టిస్తోంది. గత 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా కొత్తగా 77,266 కేసులు నమోదయ్యాయి. ప్రపంచంలో ఒక్కరోజు వ్యవధిలో అత్యధికంగా 75,760 కేసులు బుధవారం-గురువారం మధ్య భారత్‌లోనే నమోదయ్యాయి. ఈరోజు అంతకంటే ఎక్కవ కేసులు వెలుగు చూడడం ఆందోళన కలిగిస్తోంది. ఇక కొత్తగా 1,075 మంది మరణించడంతో దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు మరణాల సంఖ్య 61,529కి చేరింది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 33,87,501కి పెరిగింది. వీరిలో 25,83,948 మంది కోలుకొని ఇళ్లకు చేరగా.. 7,42,023 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. గురువారం ఒక్కరోజే 9,01,338 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. కొత్తగా 60,177 మంది కోలుకున్నారు. దీంతో కరోనా బారిన పడ్డవారిలో 76.28శాతం కోలుకున్నట్లయింది.

* వాడకుండా ఉన్న అపార్ట్‌మెంటులోని బాత్రూముల్లో వైరస్‌ ఆనవాళ్లను గుర్తించినట్లు తాజా అధ్యయనం వెల్లడించింది. చాలాకాలంగా ఖాళీగా ఉన్న ఇంట్లోని సింక్‌, ట్యాప్‌, షవర్‌ హ్యాండిల్‌ పై వైరస్‌ను గుర్తించినట్లు చైనీస్‌ సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్‌కు చెందిన పరిశోధకులు వెల్లడించారు. ఈ విషయాన్ని బ్లూమ్‌బర్గ్‌ నివేదించింది.

* ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్)లో అత్యంత విజయవంతమైన చెన్నై సూపర్‌ కింగ్స్‌కు టోర్నీ ప్రారంభం కాకముందే షాక్ తగిలింది. ఆ బృందంలో కొందరు సభ్యులు/సిబ్బంది కొవిడ్‌-19 బారిన పడ్డారని తెలిసింది. టీ20ల్లో టీమ్‌ఇండియాకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఒక పేసర్‌, సామాజిక మాధ్యమ సిబ్బంది, నిర్వాహక బృందంలోని సీనియర్‌ అధికారి, ఆయన సతీమణికి కరోనా వైరస్‌ సోకిందని సమాచారం.

* ప్రభుత్వ ఆస్పత్రుల్లో అన్ని వసతులు అందుబాటులో ఉన్నాయని.. ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లి అప్పులపాలు కావొద్దని రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. రూ.లక్ష రూపాయలయ్యే కరోనా చికిత్సకు ప్రైవేటు, కార్పొరేట్‌ ఆసుపత్రులు రూ.30లక్షల వరకు వసూలు చేయడం సబబు కాదని ఆయన ఆక్షేపించారు. విపత్కర పరిస్థితుల్లో ఇలాంటి వ్యాపార ధోరణి మంచిది కాదన్నారు. హైదరాబాద్‌లోని రెసిడెన్షియల్‌, కాలనీ అసోసియేషన్లతో మంత్రి ఈటల శుక్రవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనాపై ప్రజల్లో భయం పోగొట్టేందుకు ప్రభుత్వం పనిచేస్తోందని.. ఈ విషయంలో రెసిడెన్షియల్‌ అసోసియేషన్లు కీలక పాత్ర పోషించాలన్నారు. కరోనా సోకిన వారిని వెలివేసినట్లు చూడటం మంచిది కాదని చెప్పారు. ప్రభుత్వం, ప్రజలు కలిసి పనిచేస్తే సాధించలేనిది ఏదీ ఉండదని.. కరోనాపై పోరులో రెసిడెన్షియల్‌ సంఘాలన్నీ కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు.