Health

దగ్గు జలుబు వదలకపోతే…తేనె ప్రయత్నించండి

మందులు, టానిక్‌ల కంటే… తేనెతో దగ్గు, జలుబు తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని తాజా పరిశోధనలో తేలింది. తేనెను నెక్టార్ అని కూడా అంటారు. అంటే సంజీవని అని అర్థం. నిజమే… కొన్ని లక్షల పూల నుంచి వచ్చే తేనె తాగితే… ఆ పూలలో ఔషధ గుణాలన్నీ మనకు దక్కినట్లే. జనరల్‌గా మనకు దగ్గు, జలుబు వస్తే… వెంటనే టాబ్లెట్లు వాడేస్తాం. లేదంటే… టానిక్ వాడేస్తాం. కానీ… ఆ ఇంగ్లీష్ మందులు వాడే కంటే… సహజసిద్ధమైన తేనె వాడటం మేలని తాజా పరిశోధన తేల్చింది. తేనెలో యాంటీ బయోటిక్స్ వల్ల… దగ్గు, జలుబు చక్కగా తగ్గుతున్నట్లు పరిశోధనలో తేలింది. మందులతో పోల్చితే… తేనె కాస్త తక్కువ ధరే ఉంటుంది. తేనె వల్ల సైడ్ ఎఫెక్ట్స్ రావు, తేనె ఆరోగ్యానికి మంచిది. అందువల్ల ప్రజలు తేనెను వాడమని పరిశోధకులు కోరుతున్నారు.ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీకి చెందిన మెడికల్ స్కూల్ అండ్ నఫ్ఫీల్డ్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ప్రైమరీ కేర్ హెల్త్ సైన్సెస్… తేనెపై ఈ పరిశోధలు చేసింది. తేనె వాడే వారికి… శ్వాస సంబంధ సమస్యలు తగ్గుతున్నాయి. ముక్కు, గొంతును బాధపెడుతున్న జలుబు, సైనస్, ఫారింక్స్, లారింక్స్ అనారోగ్య సమస్యలు నయమవుతున్నాయి.తేనె వాడటం వల్ల దగ్గు, జలుబు వెంటనే తగ్గిపోవు. కాకపోతే… నెమ్మదిగానైనా అవి తగ్గుతూ… ఇతర ఆరోగ్య ప్రయోజనాలు తేనె వల్ల కలుగుతున్నాయని పరిశోధన తేల్చింది. తేనెపై మొత్తం 14 అధ్యయనాలు చేశారు. వాటిలో 9 అధ్యయనాలు పిల్లలపై చేశారు. తేనెనూ ఇతర దేశాల్లో వాడుతున్న మందుల్నీ ఇస్తూ… ఏవి బాగా పనిచేస్తున్నాయో చూశారు. అన్నింటికంటే తేనే బాగా పనిచేస్తోందని తేల్చారు. మందులు అదే పనిగా వాడితే… ప్రాణాలకే ప్రమాదమని ఎన్నో పరిశోధనలు తేల్చాయి. చాలాసార్లు… ప్రజలు వాడుతున్న యాంటీబయోటిక్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కలుగుతున్నాయి. ఫలితంగా ఉన్న అనారోగ్యం తగ్గకపోగా… కొత్తవి ఏర్పడుతున్నాయి. ఇలా జరగకుండా ఉండాలంటే… మందుల బదులు సహజసిద్ధమైనవి వాడాలి. వాటిలో తేనె అత్యంత మేలు చేస్తుదని పరిశోధకులు తేల్చారు.తేనెలో ఈ-కోలీ, సాల్మొనెల్లా సహా… డజన్ల కొద్దీ రకాల బ్యాక్టీరియాను చంపే గుణం ఉంటుంది. పాలు, టీలలో షుగర్ బదులు తేనె వేసుకొని తాగొట్టు. తద్వారా బాడీకి తేనెను అందించినట్లవుతుంది. ఫలితంగా జలుబు, దగ్గు లాంటి అనారోగ్యాల సంగతి తేనె చూసుకుంటుంది.తెనెల్లో కూడా న్యూజిలాండ్‌లోని మానుకా (Manuka) తేనె, మలేసియాలోని తులంగ్ (Tulang) తేనెలు… ప్రసిద్ధమైనవి. ఇవి బ్యాక్టీరియాతో ఎక్కువగా పోరాడుతున్నాయి. అల్సర్లను తగ్గిస్తున్నాయి. ఇవి కావాలంటే ఆన్‌లైన్ ఈ-కామర్స్ సైట్లలో కొనుక్కోవచ్చు.నిద్ర బాగా పట్టేందుకు కూడా తేనె బాగా పనిచేస్తోదనీ, పిల్లలకు పీడ కలలు రాకుండా తేనె చేసేతోందని… 139 మంది పిల్లలపై జరిపిన మరో పరిశోధనలో తేలింది. అందువల్ల ఈరోజే ఓ తేనె బాటిల్ కొనుక్కోండి. తేనె… నల్లగా ఉంటే అది మంచి తేనె అని అర్థం. ఆకర్షణీయంగా, ఎర్రగా ఉందంటే… అది సరైన తేనె కాదని గమనించాలి.