Devotional

ఏకాంతంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు

ఏకాంతంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు

శ్రీ గోవిందరాజస్వామివారి పవిత్రోత్సవాలు ప్రారంభం. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలు శుక్ర‌వారం ప్రారంభమయ్యాయి.ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.ఉదయం స్వామివారిని సుప్రభాతంతో మేల్కొలిపి, తోమాలసేవ, సహస్రనామార్చన నిర్వహించారు. అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీగోవింద‌రాజ‌స్వామివారి ఉత్సవర్లను యాగశాలకు వేంచేపు చేసి వైదిక కార్యక్రమాలు నిర్వహించారు.ఆ త‌రువాత స్నపనతిరుమంజనం వేడుక‌గా జరిగింది. ఇందులో భాగంగా ఉత్సవమూర్తులకు పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరినీళ్లు, పలురకాల పండ్ల రసాలతో అభిషేకం నిర్వహించారు.సాయంత్రం 6.00 నుండి రాత్రి 7.30 గంటల వరకు ఆలయంలోని యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహించి పవిత్ర ప్రతిష్ఠ చేయనున్నారు. వైదిక సంప్రదాయం ప్రకారం జాతాశౌచం, మృతాశౌచం వంటి వేళల్లో ఆలయ ప్రవేశం నిషిద్ధం. అయినా యాత్రీకుల వల్లగానీ, సిబ్బంది వల్ల గానీ తెలిసీతెలియక ఇటువంటి దోషాలు జరుగుతుంటాయి.ఇలాంటి వాటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా నివారించేందుకు ప్రతి ఏడాదీ మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ.ఈ పవిత్రోత్సవాలలో ఆలయ శుద్ధి, పుణ్యాహవచనం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. కోవిడ్ – 19 నిబంధ‌న‌ల మేర‌కు ఆల‌యంలో ప‌విత్రోత్స‌వాలు ఏకాంతంగా నిర్వ‌హించారు. ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ చిన్నజీయ‌ర్‌ స్వామి, ఆలయ ప్ర‌త్యేకశ్రేణి డెప్యూటీ ఈవో శ్రీ‌మ‌తి వ‌ర‌ల‌క్ష్మి, టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్ శ్రీ కృష్ణ‌మూర్తి ఇత‌ర అధికారులు, భ‌క్తులు పాల్గొన్నారు.

సెప్టెంబ‌రు 19 నుండి 27వ తేదీ వ‌ర‌కు జ‌రుగ‌‌నున్న తిరుమ‌ల శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి బ్ర‌హ్మోత్స‌వాలను కోవిడ్ కార‌ణంగా ఆల‌యంలో ఏకాంతంగా నిర్వ‌హించ‌‌నున్న‌ట్లు టిటిడి ఛైర్మ‌న్ శ్రీ వై.వి.సుబ్బారెడ్డి తెలిపారు. అక్టోబ‌ర్‌లో నిర్వ‌హించే న‌వ‌రాత్రి బ్ర‌హ్మోత్సవాల‌ను అప్ప‌టి ప‌రిస్థితుల‌ను బ‌ట్టి ఎలా నిర్వ‌హించాలో నిర్ణ‌యిస్తామ‌న్నారు.టిటిడి ధర్మకర్తల మండలి సమావేశం శుక్ర‌వారం తిరుమలలోని అన్నమయ్య భవనంలో జరిగింది. స‌మావేశం శ్రీ వైవి.సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడారు.– శ్రీ‌‌వారి వైభ‌వాన్ని విశ్వ వ్యాప్తం చేయడంలో భాగంగా కాశ్మీర్ నుండి క‌న్యాకుమారి వ‌ర‌కు శ్రీ‌వారి ఆల‌యాలు నిర్మిస్తున్న‌ట్లు తెలిపారు. ఇందులో స్థానిక భ‌క్తుల‌ను భాగ‌స్వాముల‌ను చేస్తూ, దాత‌ల‌ నుండి విరాళాలు సేక‌రించాల‌ని నిర్ణ‌యించాం.– టిటిడి ఆదాయం పెంచుకునే ఆలోచ‌న‌లో భాగంగా ఇక‌మీద‌ట న‌గ‌దు, బంగారు డిపాజిట్ల‌లో ప్ర‌తి నెల కొంత మొత్తానికి గ‌డువు తీరేలా బ్యాంకుల్లో జ‌మ చేయాల‌ని నిర్ణ‌యం తీసుకున్నాం. ప్రస్తుత ప‌రిస్థితుల్లో ‌బ్యాంకులు త‌క్కువ వ‌డ్డీ ఇస్తున్నందు వ‌ల‌న టిటిడి డిపాజిట్ల‌కు ఎక్కువ వ‌డ్డీ వ‌చ్చేలా ఆర్‌బిఐ, ఇత‌ర బ్యాంకుల‌తో చ‌ర్చించాల‌ని నిర్ణ‌యం తీసుకున్నాం.