Health

డిప్రెషన్ పారద్రోలే సీతాఫలం

డిప్రెషన్ పారద్రోలే సీతాఫలం

సీతాఫలాలు ఎంతో తియ్యగా ఈ పండుతో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఎన్నెన్నో. అసలే చలి సీజన్‌లో ఈ పండు తింటే మరింత ఎక్కువగా జలుబు చేస్తుందని కొందరు ఈ పండును తినడానికి పెద్దగా ఇష్టపడరు. కానీ వేసవిలో దొరికే మామిడి వేడిచేస్తుందన్నా, శీతకాలంలో దొరికే సీతాఫలాలు జలుబు చేస్తాయన్నా… ఏ సీజన్‌లో దొరికే పండ్లను ఆ సీజన్‌లో తినాల్సిందే. సీతాఫలంతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలను తెలుసుకుంటే ‘జలుబూ–గిలుబూ జాన్‌తానై’ అంటూ ఆ అపోహలన్నీ పక్కనబెట్టి తప్పక తినేస్తారు. సీతాఫలంతో మనకు సమకూరే ప్రయోజనాల్లో ఇవి కొన్ని మాత్రమే.సీతాఫలంలో అనేక రకాల యాంటీఆక్సిడెంట్స్, విటమిన్‌–సి వంటివి కలిసి శరీరానికి రోగనిరోధక శక్తిని ఇస్తాయి. ఫలితంగా ఈ పండు ఎన్నో రకాల జబ్బులను నివారిస్తుంది. సీతాఫలంలోని యాంటీ ఆక్సిడెంట్స్‌ కారణంగా అది ఎన్నో రకాల క్యాన్సర్లను నివారిస్తుంది.సీతాఫలంలో పొటాషియమ్‌ చాలా ఎక్కువ. అందుకే… అధిక రక్తపోటు (హైబీపీ) ఉన్నవారు ఈ పండును తింటే… రక్తపోటును అదుపులో ఉంటుంది.రక్తహీనత ఉన్నవారికి సీతాఫలం చాలా మంచిది. ఇందులో ఐరన్, కాపర్‌ పుష్కలంగా ఉంటాయి. అవి రక్తహీనత (అనిమియా)ను సమర్థంగా అరికడతాయి.సీతాఫలాల్లోని విటమిన్‌–ఏ వల్ల జుట్టు ఆరోగ్యకరంగా మెరుస్తూ ఉండటంతో పాటు, మేనికి మంచి నిగారింపు వస్తుంది. ఇలా జుట్టు బాగా పెరగడానికి సీతాఫలంలోని ఐరన్‌ ఉపకరిస్తుంది.సీతాఫలంలో పీచు చాలా ఎక్కువ. ఈ పీచుతో పాటు ఇందులోని కాపర్‌ కలిసి మలబద్దకం వంటి సమస్యను నివారిస్తాయి. ఈ పండులోని పీచు పదార్థాలు జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్ని మెరుగుపరిచి, జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేసేలా చూస్తాయి.ఇందులో ఉండే మెగ్నీషియమ్‌ రక్తప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది. ఫలితంగా గుండె ఆరోగ్యంగా ఉంటుంది.సీతాఫలం కీళ్లవాతాన్ని (రుమాటిజమ్‌)నూ, ఆర్థరైటిస్‌ వంటి ఎముకల సమస్యలనూ నివారిస్తుంది.ఈ పండు కండరాల బలహీనతను తగ్గిస్తుంది. చురుగ్గా ఉంచుతుంది.సీతాఫలం డిప్రెషన్‌ను తగ్గిస్తుంది.