Fashion

జామకాయ ప్రయోజనాలు

జామకాయ ప్రయోజనాలు

జామ కాయ ఉపయోగాలు..

?ఎక్కడ చూసినా జామకాయలే కనిపిస్తున్నాయి కాబట్టి. విరివిగా, చౌకగా దొరికే ఈ జామకాయలు విలువలేనివని అనుకోకూడదు. విలువైన పండ్లలో వుండే న్యూట్రీషియన్స్ ఈ జామలోనూ అధికంగా ఉంటాయి.

?ఇవి ఎక్కువకాలం దొరుకుతూ ఉంటాయి. అంతే కాకుండా వీటిని ఇండ్లలో కూడా పెంచుకునే చెట్టుగా ఎంతో పేరు తెచ్చుకున్నది.

?జామపండ్లు ఆరోగ్యానికీ అధిక లాభాన్ని చేకూరుస్తాయి. ఈ పండ్ల ముక్కలపై మిరియాలపొడి, ఉప్పు చల్లుకుని తింటే ఆరోగ్యానికి మరింత దోహదం చేస్తాయి.

?కానీ ఎవరికి నచ్చిన విధంగా వారు వీటిని తింటూ ఉంటారు. వీటితో జామ్‌ లు ఐస్‌క్రీమ్స్ సలాడ్స్ వంటివి తయారు చేసుకోవచ్చు.

? జామపళ్ళలో ‘సి’ విటమిన్ పుష్కలంగా వుంటుంది. అపరిమిత పోషకాల నిలయం జామ.

?అనారోగ్యాన్ని దరిచేరనీయని జామ. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. కనుకనే దోరగా, దోరగా ఉన్న జామకాయను చూసిన వెంటనే తినేయాలనుకొనే వారుండరంటే అతిశయోక్తి కాదు. కొందరికి పచ్చి కాయలు నచ్చితే, మరి కొందరికి పండుపైనే మనసు.

? ఏదేమైనా పిల్లలనుండి పెద్దలవరకూ ఇష్టపడేది జామకాయనే.

?విటమిన్‌ సి ఎక్కుగా దొరికే వాటిలో ఉసిరికాయలకు ధీటుగా జామను చెప్పుకోవచ్చు.

?కమలాకన్నా ఐదు రెట్లు ఇందులో విటమిన్‌ సి ఉంటుంది. నిమ్మ, నారింజలలో కంటే నాలుగు నుంచి పది రెట్లు ఎక్కువగా వుంటుంది. ఈ కాయ పండుతున్నకొద్దీ ‘సి’ విటమిన్ శాతం అధికమవుతుంది. కేవలం విటమిన్‌ సి మాత్రమే కాదు. ఇందులో విటమిన్‌ ఎ, విటమిన్‌ బి, కేల్షియమ్‌, ఫాస్పరస్‌, పొటాషియం, ఐరన్‌, ఫోలిక్‌యాసిడ్‌ వంటివి మెండుగా ఉన్నాయి.

?అంతేకాదు, జీర్ణశక్తిని పెంపొందించే ఫైబర్‌ ఇందులో నిండుగా ఉంది.

జామకాయలో పోషకాలు, విటమిన్లు, పీచు పదార్థం వంటి గుణాల వల్ల ప్రస్తుతం అందరికీ ఇది ప్రీతిపాత్రమై కూచుంది. ముఖ్యంగా దీనిలో క్యాలరీలు తక్కువగా ఉండి పీచు పదార్ధం చాలా ఎక్కువగా ఉంటుంది. నీటిలో కరిగే బి. సి. విటమిన్లు, కొవ్వులో కరిగే విటమిన్ ఎ జామకాయలో ముఖ్యంగా లభించే పోషకాలు. చివరకు ప్రపంచంలో పళ్లు అనేవి ఉన్నాయనే విషయాన్ని మర్చిపోండి అంటూ మధుమేహ రోగులకు చెబుతూ ఉండే వైద్యులు సైతం చక్కెర వ్యాధిగ్రస్తులు తప్పక తినవలసిన పళ్ల జాబితాలో జామను మొదటి వరుసలో చేర్చి చెబుతుంటారు.

?దీన్ని బట్టి తెలుసుకోవచ్చు జామ పపర్ ఏమటో.. ఇక జామకాయలోని ఆ పవర్ఫుల్ ఆరోగ్య గుణాలేంటో తెలుసుకుందాం…

??మధుమేహగ్రస్తులకు:

?చక్కెర వ్యాధిగ్రస్తులు తప్పక తినవలసిన పళ్ల జాబితాలో జామను మొదటి వరుసలో ఉంచబడింది. డయాబెటిస్ రోగులకు సంజీవనిలా ఉపయోగపడుతుందంటే ఆశ్చర్యపడవలసిన పనిలేదు.

?బొప్పాయి, ఆపిల్, నేరేడు పండు కంటే జామకాయలోనే పీచు పదార్ధం ఎక్కువగా ఉండటంతో ఇది సుగర్ వ్యాధికి చక్కటి ఔషధం మరి.

??బరువు తగ్గడానికి:

?అన్నిటికన్నా ఎక్కువగా బరువు తగ్గాలి అనుకునేవారికి జామ ఒక మంచి ఔషదంగా చెప్పవచ్చు. ఎందుకంటే, జామకాయను తింటే ఇట్టే కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. దాంతో ఎక్కువ ఆహారం తినలేరు. పోషకాలు ఎలాగూ ఉన్నాయి కనుక నీరసం రాదు.

?అందుకే ఒబేసిటీతో బాధపడేవారు తమ ఆహారంతోపాటూ ఒక జామకాయను తీసుకుంటే మంచి ఫలితం వస్తుంది. కొవ్వు మెటబాలిజంను ప్రభావితం జేసే ‘ పెక్టిన్’ జామలొ లభిస్తుంది. ఇది కొలెస్ట్రాల్ ను తగ్గించి, పేగుల్లో ప్రోటీన్ పరిశుభ్రతను పరిరక్షించడంలో సహకరిస్తుంది. జామలొ కొవ్వు, క్యాలరీలు తక్కువగా ఉంటాయి కావున బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి పండు.

??క్యాన్సర్ నివారిణి:

?శక్తివంతమైన యాంటి ఆక్షిడేంట్ గా ఉపయోగపడుతుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు కేన్సర్ నివారిస్తాయి.

?ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులకు నివారిణిగా ఉపయోగపడుతుంది.

??దంత క్షయం:

?జామ ఆకులను నమలడం వల్ల పంటి నొప్పులు తగ్గడమే కాక ఆకలి కూడా పెరుగుతుంది.

?చిగుళ్ల వాపులను తగ్గించుకోవచ్చును. పైగా కొన్ని రకాల వ్యాధుల బారిన పడి ఆకలి మందగించిపోయిన వారికి ఇది ఆకలి పుట్టించగలదు.

? ఆకులను నమిలితే దంతాలు శుభ్రపడతాయి. ధృడత్వం కూడా చేకూరుతుంది. దంతాలు కదలటం, చిగుళ్లనుంచి రక్తం కారటం వంటి సమస్యలను అరికడుతుంది.

??ఎసిడిటి:

?ఎసిడిటికి రోజుకో పండు తింటే మంచిది.

?కడుపు ఉబ్బరం, కడుపులో మంట నుండి ఉపశనం పొందేలా చేస్తుంది.

??కీళ్ల నొప్పులు:

?కీళ్లవాపు, నొప్పులు వంటి సమస్యలతో బాధపడేవారు జామాకులను కొద్దిగా వేడిచేసి వాపులున్నచోట కట్టుకట్టుకోవాలి.

?కండరాలు గట్టిపడేలా చేస్తుంది. ఎముకల ద్రుడత్వనాకి జామకాయలో ఉండే మ్యాంగనీస్ బాగా సహాయపడుతుంది.

??జలుబు, దగ్గు, జ్వరం:

?ఐదు, ఆరు ఆకులు నీటిలో మరగబెట్టి డికాక్షన్‌ వాడితే దగ్గు, జలుబు పోతుంది.

?ఆకుల నుంచి లభించే తైలం యాంటీ ఆక్సిడెంట్ల చర్యలను వేగవంతం చేస్తాయి.

??కంటి ఆరోగ్యానికి:

? జామకాయలో విటమిన్ ఎ అధికంగా ఉండటం వల్ల ఈ న్యూట్రిషియన్ ఐ సైట్ ను ఆరోగ్యంగా ఉంచుతుంది.

??సంతానోత్పత్తికి:

?జామకాయను బాగా నమిలి తినడం వల్ల శరీరంలో ఫిల్లెట్ బాగా ఉత్పత్తి అవుతుంది.