Movies

సూర్యాకు చలసాని మద్దతు

సూర్యాకు చలసాని మద్దతు

సూర్య నటిస్తూ నిర్మిస్తున్న చిత్రం ‘ఆకాశం నీ హద్దురా’. ఎయిర్‌ డెక్కన్‌ వ్యవస్థాపకుడు జీఆర్‌ గోపీనాథ్‌ బయోపిక్‌గా వస్తున్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 30న అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో విడుదల చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే, సూర్యతో ‘సింగం’ సిరీస్‌ను రూపొందించిన దర్శకుడు హరి.. కథానాయకుడు సూర్యకు లేఖ రాశారు. ఓటీటీలో విడుదల అంశంపై పునరాలోచన చేయాలని సూచించారు. దీనిపై ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్‌ అధినేత అశ్వినీదత్‌ స్పందించారు. సూర్య తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించారు. కరోనా కారణంగా థియేటర్లు మూతపడ్డాయని, ఒకవేళ ఇప్పుడు తెరుచుకున్నా ప్రేక్షకులను రప్పించి వారిని కరోనాకు బలి చేయడం సరికాదని అభిప్రాయపడ్డారు.