Movies

200 సార్లు చేయాలని టార్గెట్

200 సార్లు చేయాలని టార్గెట్

‘‘ఈ రోజు విజయవంతంగా 150 పూర్తి చేశా. నెక్ట్స్‌ టార్గెట్‌ డబుల్‌ సెంచరీయే’’ అంటున్నారు కీర్తీ సురేశ్‌. ఇంతకీ, ఆమె చెబుతున్నది దేని గురించో తెలుసా? సూర్య నమస్కారాల గురించి! ప్రతిరోజూ యోగా, సూర్య నమస్కారాలూ చేస్తారు. అలాగే, శుక్రవారమూ చేశారు. ‘‘150 సూర్య నమస్కారాలతో ఉదయాన్ని ప్రారంభించడం కంటే మంచిది ఏదీ లేదు. నెక్ట్స్‌ 200 టార్గెట్‌గా పెట్టుకున్నాను. ఉదయమే సూర్య నమస్కారాలు చేయడం వల్ల ఎంత ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉందో చెప్పలేను. రక్త ప్రసరణ, రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. మన శరీరంలో చక్రాలు అన్నిటినీ ప్రకాశించేలా చేస్తుంది’’ అని కీర్తీ సురేశ్‌ అన్నారు. ‘మహానటి’ చిత్రంతో పోలిస్తే చాలా బరువు తగ్గారామె. కొత్త చిత్రాలు ‘మిస్‌ ఇండియా’, ‘గుడ్‌ లక్‌ సఖి’, ‘రంగ్‌ దే’లో కీర్తీ సురేశ్‌ సన్నగా సన్నజాజిలా కనిపించనున్నారు.