NRI-NRT

వంగూరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో 24గంటల సాహిత్య సదస్సు

Vanguri Foundation 24 Hours Literary Meet In October

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు సాహిత్యాభిమానులను ఒకే వేదికపైకి తీసుకొచ్చేందుకు వంగూరి ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నారు. అక్టోబర్‌ 10, 11 తేదీల్లో ప్రపంచ 7వ తెలుగు సాహితీ సదస్సును 24గంటల పాటు నిర్విరామంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సదస్సుకు ఆసియా, ఆస్ట్రేలియా, ఐరోపా, ఆఫ్రికా, అమెరికా ఖండాల్లోని అన్ని దేశాల్లో ఉన్న తెలుగు భాషాభిమానులెవరైనా హాజరుకావొచ్చని నిర్వాహకులు తెలిపారు. ఇది జూమ్‌ వీడియో ద్వారా నిర్వహించి యూట్యూబ్‌, ఫేస్‌బుక్‌ తదితర సామాజిక మాధ్యమాల ద్వారా నిర్విరామంగా ప్రసారమవుతుందని తెలిపారు. తెలుగు రచయితలు, వక్తలు, పండితులు, కవులు, సాహిత్యాభిమానులు, తెలుగు భాషా ప్రేమికులు ఏ దేశంలో నివసిస్తున్నా.. ఏ సమయంలోనైనా ఈ సదస్సులో పాల్గొని ప్రసంగించవచ్చు.. వీక్షించవచ్చని నిర్వాహకులు తెలిపారు. తెలుగు భాష, సాహిత్య, కళారంగాలు ప్రసంగాంశాలుగా ఉండే ఈ సదస్సులో ప్రసంగించదలచుకున్నవారెవరైనా సంక్షిప్తంగా తమ ప్రసంగ వ్యాసం, వక్త పేరు, ఫొటో, చిన్న పరిచయం, చిరునామా, వాట్సాప్‌ నంబర్‌తో ప్రతిపాదనలు సెప్టెంబర్‌ 10కల్లా తమకు పంపించాలని సూచించారు. వివరాలను vangurifoundation@gmail.com; వాట్సాప్: + 1 832 594 9054కు పంపాలని కోరారు.